కాదంబినీ గంగూలీ
జననం :1861-భగల్ పూర్
మరణం :అక్టోబర్ 3, 1923-కోల్కతా
కాదంబినీ గంగూలీ బ్రిటీషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు. దక్షిణ ఆసియా నుండి పాశ్చాత్య వైద్యములో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యురాలు.
తొలి జీవితం
బ్రహ్మ సమాజ సంస్కర్త, బ్రజ కిషోర్ బాసు కుమార్తె అయిన కాదంబినీ బ్రిటీషు ఇండియాలోని బీహార్ రాష్ట్రపు భగల్‌పూర్‌లో జన్మించింది. వీరి కుటుంబము ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బరిసాల్ జిల్లాకు చెందిన చాంద్సీకి చెందినది. ఈమె తండ్రి భగల్‌పూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవాడు. ఆయన అభయచరణ్ మల్లిక్‌తో కలిసి భగల్‌పూర్‌లో స్త్రీజనోద్దరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. వీరు 1863లో భారతదేశములోనే తొట్టతొలి మహిళా సంస్థ అయిన భగల్‌పూర్ మహిళా సమితిని ప్రారంభించారు.
కాదంబినీ తన విద్యాభ్యాసాన్ని వంగ మహా విద్యాలయలో ప్రారంభించింది. జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ బెథూన్ స్థాపించిన బెథూన్ పాఠశాలలో ఉండగా 1878లో ఈమె కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తొలి మహిళగా చరిత్ర సృష్టించినది. ఈమె కృషికి గుర్తింపుగా బెథూన్ కళాశాల మొదటిసారిగా ఎఫ్.ఎ (ఫర్స్ట్ ఆర్ట్స్), ఆ తరువాత 1883లో గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈమె మరియు చంద్రముఖి బాసు బెథూన్ కళాశాలనుండి ఉత్తీర్ణులులైన తొలి విద్యార్ధినులు. తద్వారా మొత్తం దేశములోను మరియు బ్రిటీషు సామ్రాజ్యములోను పట్టభద్రులైన తొలి మహిళలుగా గుర్తింపుపొందారు.
కాదంబినీ గంగూలీ.
ReplyDelete