అటల్ బిహారీ వాజపేయి
1924, డిసెంబరు 25న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. బ్రహ్మచారి ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభ కు ఎన్నికైనారు. మధ్యలో వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోకసభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీ కి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
పురస్కారాలు
- 1992, పద్మభూషణ్
- 1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం
- 1994, లోకమాన్య తిలక్ పురస్కారం
- 1994, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
- 1994, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు.
అటల్ బిహారీ వాజపేయి
ReplyDelete