భారతీయ మహిళ-5
స్త్రీని స్త్రీగా గౌరవించాలి.
తల్లి ప్రేమ సముద్రం వలె అనంతమైనది.
స్త్రీ హృదయం చదివితే చాలు..అన్ని పుస్తకాలు చదివినట్లే.
భారతీయ మహిళకు పాశ్చాత్య మహిళకు తేడా ఏమీ లేదు. స్త్రీ , స్త్రీయే. కాకపొతే పాశ్చాత్య దేశాల్లో మహిళల పట్ల వున్న సైద్ధాంతిక ఆలోచన, మహిళ గౌరవాన్ని తగ్గిస్తున్నది.ఆ దేశాల్లో ఒక పురాణ కథ వాళ్ళు చెప్పుకుంటారు. అదేమిటంటే, దేవుడు మొదట పురుషుణ్ణి పుట్టిస్తాడు.ఆ తరువాత అతని పక్కటెముక నుండి ఆడది పుడుతుంది.అయినప్పటికీ అతను ఆరొగ్యంగానే వుంటాడని, స్త్రీ పనికిరానిదిగా వున్న ఎముక నుండి పుట్టింది కాబట్టి, స్త్రీకి ప్రాధాన్యత లేదనే అర్థంలో చర్చ్ భావించింది.ఆ దిశలో 1925 సంవత్సరం వరకు వోటు హక్కు కూడా ఇవ్వని జీవులుగా ఆ సమాజం చూసిందనేది నగ్న సత్యం. అందుకే అక్కడి మహిళలు పంజరంలో నుండి స్వేచ్చా ప్రపంచంలోకి రావటానికి చేసిన ప్రయత్నం వాళ్ళకు హక్కులు ఇచ్చి వుండవచ్చు కాని,నిజమైన సంతృప్తి ఇవ్వలేదనటానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.
కేరళకు చెందిన అమృతానందమయి చేస్తున్న ఆధ్యాత్మిక సేవా పనులలో,వేలాది మంది విదేశీ మహిళలు ఎందుకు పాల్గొంటున్నారు.?
రవిశంకర్ గురూజీ కి వున్న కోట్లాది శిష్యుల్లో విదేశీ మహిళల సంఖ్య ఎందుకు పెరుగుతుంది?
సత్యసాయిబాబా ప్రవచనాల్లో విదేశీ మహిళలు వుండి,వేద మంత్రాలు అభ్యసం ఎందుకు చేసేవారు?
అంతెందుకు? స్వామి వివేకానంద అమెరికా,యూరోప్ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు,సగానికి పైగా అక్కడి మహిళలు శిష్యులయ్యారు.స్వామిజీని తమ తమ ఇండ్లకు ఎందుకు ఆహ్వానించేవారు?
వీటన్నింటికీ సమాధానం ఒక్కటే...యాజ్ఞ వల్క్యుడు అనే ఋషి చెప్పిన ప్రకారం..భగవంతుడు ఒక దేహాన్ని సృష్టించి,వాటిని రెండుగా అంటే ఒక భాగం స్త్రీ యని, మరొక భాగం మగవాడు యని,ఆ దేహం నిండా భగవంతుని అంశ వుందని తేల్చిచెప్పాడు.రెండు బఠానీ ముక్కలు కిలిపితే,ఒక బఠాని గింజ ఎలా అవుతుందో,అలాగె స్త్రీ పురుషులు కూడా అంతేనని బృహదారణ్యక ఉపనిషత్తు లో చెప్పబడింది.
ఈ విషయాన్నే మాతా స్వామి వివేకానంద,అమృతానందమయి,రవిశంకర్ గురూజీ,చిన్మయానంద వంటి సాధువులు మహిళల్లో వున్న నిజమైన దివ్య శక్తిని నిద్ర లేపారు కాబట్టి,విదేశీ మహిళలు ఆకర్షితులవుతున్నారు.
- అప్పాల ప్రసాద్.
భారతీయ మహిళ-5
ReplyDeleteబాగా చెప్పారు. అందరు చదివి తెలుసుకోవాల్సిన విషయం ఇది.
ReplyDelete