Breaking News

సుబ్రహ్మణ్య భారతి

జననం:  డిసెంబర్ 11, 1882
మరణం: సెప్టెంబర్ 11, 1921



సుబ్రహ్మణ్య భారతి తమిళనాడు, ఇండియాకు చెందిన ఒక తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు మరియు ఛాందసవాద వ్యతిరేక సంస్కర్త. మహాకవి భారతి (ప్రశంసాత్మక బిరుదు. మహాకవి అంటే పలు భారతీయ భాషల్లో గొప్ప కవి అని అర్థం) ఇతడు భారతదేశంలో అతి గొప్ప కవులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. భారతి అటు వచనం ఇటు పద్యం రెండింటిలోనూ ఫలవంతమైన మరియు సమర్థమైన రచయిత. ఇతడి రచనా సంవిధానం దక్షిణ భారతదేశంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజారాసులు మద్దతు ఇవ్వడంలో ఎంతగానో తోడ్పడింది. భారతీయ చరిత్రలో అత్యంత కీలకమైన కాలంలో భారతి నివసించాడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ నేతలైన మహాత్మాగాంధీ, బాల గంగాధర తిలక్, శ్రీ అరబిందో మరియు V.V.S.అయ్యర్ ఇతడి సమకాలికులు.

ప్రారంభ జీవితం

భారతి తమిళ గ్రామం ఎట్టాయపురంలో 1882 డిసెంబర్ 11న చిన్నస్వామి సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు ఎలాక్కుమి (లక్ష్మి) అమ్మాల్ దంపతులకు పుట్టాడు. ఇతడి అసలు పేరు "సుబ్బయ్య". తిరునల్వేలి లోని "M.D.T. హిందూ కాలేజ్" అని పిలువబడే స్థానిక ఉన్నత పాఠశాలలో ఇతడి చదువున్నాడు. చాలా చిన్న వయసునుంచి ఇతడు సంగీతం నేర్చుకున్నాడు, 11 ఏళ్ల ప్రాయంలో, ఇతడిని పద్యాలు, పాటలు కూర్చవలసిందిగా కోరుతూ ఎట్టాయపురం ఆస్థాన కవులు, సంగీతకారుల సదస్సుకు ఆహ్వానించారు. ఇక్కడే ఇతడికి "భారతి" అని బిరుదు బహూకరించారు ("విద్యాదేవత అయిన సరస్వతిచేత ఆశీర్వచించబడిన వాడు అని దీని అర్థం).

భారతి 5 సంవత్సరాల వయస్సులో తల్లిని 16 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాడు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే తండ్రి పెంపకంలో ఇతడు పెరిగాడు, తన కుమారుడు ఇంగ్లీషు నేర్చుకోవాలని, అర్థిమెటిక్‌లో నైపుణ్యం సాధించి ఇంజనీరై సుఖ జీవితం గడపాలని ఆ తండ్రి ఆశించాడు. అయితే, భారతి పగటి కలలు కంటూ కాలం గడిపేవాడు తప్ప చదువును పెద్దగా పట్టించుకునే వాడు కాడు. 1897లో, అతడికి బాధ్యతలు నేర్పాలని భావించిన తండ్రి, 14 ఏళ్ల భారతికి ఏడేళ్ల వయసున్న తన బంధువులమ్మాయి చెల్లమ్మాళ్‌తో పెళ్లి జరిపించాడు.

ఈ పెళ్లి అనంతరం, భారతి బయటి ప్రపంచాన్ని ఆసక్తిగా చూడటం మొదలెట్టాడు, 1898లో ఇతడు బెనారస్‌కి వెళ్లాడు తన జీవితంలో తదుపరి నాలుగు సంవత్సరాలు అన్వేషణల మార్గంలో నడిచాడు. ఈ కాలంలో ఇతడు తన చిన్ని గుడిసె నుంచి వెలుపల ఉన్న సువిశాల దేశాన్ని కనుగొన్నాడు. మదురై సేతుపతి ఉన్నత పాఠశాల (ఇప్పుడు ఇది హయ్యర్ సెకండరీ స్కూలు)లో భారతి ఉపాధ్యాయుడిగా పనిచేశారు, తర్వాత తన జీవితంలో అనేకసార్లు పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు.

అభిప్రాయాలు

బెనారస్‌లో (దీన్ని కాశి, వారణాసి అని కూడా పిలుస్తారు) అతడు ఉన్న కాలంలో, భారతి హిందూ ఆధ్యాత్మికత మరియు జాతీయవాద భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. దీంతో అతడి ప్రాపంచిక దృక్పధం విశాలమైంది, అతడు సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలు నేర్చాడు. అదనంగా, అతడు తన బాహ్య స్వరూపాన్ని మార్చుకున్నాడు. హిందూ సమాజంలో సభ్యులు ధరించే తలపాగాలు భారతిని బాగా ఆకర్షించినట్లు కనిపిస్తోంది (భారతీయ సమాజంలో సంప్రదాయంగా ఉంటున్న తలపాగాలు రాజులు ధరించే కిరీటాలకు ప్రాతినిధ్యం వహించేవి.) భారతి కూడా తలపాగాను ధరించడం ప్రారంభించాడు. అతడు గడ్డం కూడా పెంచేశాడు నడక కూడా రాజసంగా తలెత్తుకుని నడవటం ప్రారంభించాడు.

త్వరలోనే భారతి సాంప్రదాయిక భారతీయ సమాజంలోని సామాజిక కట్టుబాట్లు మరియు మూఢనమ్మకాలను దాటి చూడడం ప్రారంభించాడు. ఇతడు 1905లో, బెనారస్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యాడు. స్వంత ఊరుకు తిరిగి వస్తుండగా, అతడు వివేకానందుడి ఆధ్యాత్మిక పుత్రిక సిస్టర్ నివేదితను కలిశాడు. ఆమె బోధనలద్వారా భారతి ఆలోచనలు కొత్త మలుపు తిరిగాయి, మహిళల హక్కులను గుర్తించడం వైపు ఇతడు మొగ్గు చూపాడు. మహిళా విముక్తి భావన భారతి మనస్సుపై తీవ్రంగా ప్రభావం చూపింది. శక్తి రూపంలో 'నూతన మహిళ'ను అతడు దర్శించాడు, సహకారాత్మక సహనభావంతో కొత్త భూమిని నిర్మించడంలో పురుషుడికి నిజమైన జీవన భాగస్వామిగా మహిళను ఇతడు దర్శించాడు.

ఈ కాలంలోనే, బయటి ప్రపంచం గురించి అవగాహన కలిగి ఉండాలని భారతి అర్థం చేసుకున్నాడు, జర్నలిజం ప్రపంచంపై పాశ్చాత్య ముద్రణా మీడియాపై మక్కువ చూపసాగాడు. 1904లో తమిళ దిన పత్రిక స్వదేశమిత్రన్ సహాయ సంపాదకుడిగా భారతి చేరాడు. 1907 ఏప్రిల్ నాటికి, M.P.T. ఆచార్యతో కలిసి తమిళ వారపత్రిక ఇండియా ను, ఇంగ్లీష్ వార్తాపత్రిక బాల భారతం ను సంకలనం చేయడం ప్రారంభించాడు. ఈ వార్తాపత్రికలు భారతిలోని సృజనాత్మకతను వ్యక్తీకరించే సాధనాలుగా మారాయి, ఇది ఈ కాలంలోనే పతాకస్థాయికి చేరుకోవడం ప్రారంభించింది. ఈ ఎడిషన్లలో భారతి తన కవితలను వరుసగా ప్రచురించడం ప్రారంభించాడు. మతపరమైన మంత్రాల నుంచి జాతీయ గీతాలవరకు, దేవుడికి మనిషికి మధ్యన సంబంధం గురించిన వివాదాల నుంచి రష్యన్ మరియు ఫ్రెంచ్ విప్లవాలపై పాటల వరకు భారతి ఎంచుకునే అంశాలు వైవిధ్యపూరితంగా ఉండేవి.

వెనుకబడిన వర్గాలను కించపరుస్తున్న సమాజానికి, భారత్‌ను ఆక్రమించిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతడు ఏకకాలంలో తిరగబడ్డాడు.

1907లో జరిగిన చారిత్రాత్మక సూరత్ కాంగ్రెస్ సదస్సులో భారతి పాల్గొన్నాడు, ఈ సమావేశంలో తిలక్ మరియు అరవిందో నేతృత్వం లోని మిలిటెంట్ పక్షానికి, మితవాద వర్గానికి మధ్యన భారత జాతీయ కాంగ్రెస్‌లో ఏర్పడిన విభజనలు మరింత తీవ్రమయ్యాయి. తిలక్, అరవిందోలతో పాటు వి.ఓ చిదంబరం పళ్లై మరియు కంచి వరదాచార్యలకు భారతి మద్దతు తెలిపాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనను తిలక్ బహిరంగంగా సమర్థించాడు.

భారతి ఇదే కాలంలో రాతలో, రాజకీయ కార్యాచరణలో తీవ్రంగా కూరుకుపోయాడు. 1908లో మద్రాసులో, స్వరాజ్ (స్వాతంత్ర్యం)ని జరుపుకోడానికి ఇతడు బహిరంగ సభ నిర్వహించాడు. ఇతడు రాసిన జాతీయ వాద కవితలు వందేమాతరం , ఎంతయుమ్ తయ్యుమ్ మరియు జయ భారత్ లను ముద్రించారు మరియు పాఠకుల కోసం ఉచితంగా పంపిణీ చేశారు. ఇతడిని ప్రజలు భారత జాతీయ కవిగా గుర్తించారు.

1908లో, వి.ఒ చిదంబరం పిళ్లైకి వ్యతిరేకంగా దాఖలు చేసిన ఒక కేసులో ఇతడు సాక్ష్యం చెప్పాడు. అదే సంవత్సరంలో, ఇండియా పత్రిక యజమానిని మద్రాసులో అరెస్టు చేశారు. తననూ అరెస్టు చేసే అవకాశముండటంతో, భారతి ఆనాటికి ఫ్రెంచ్ పాలనలో ఉన్న పాండిచ్చేరికి పారిపోయాడు. ఆక్కడినుంచి ఇతడు వార పత్రిక ఇండియా , విజయా , తమిళ పత్రిక, బాలభారత , ఇంగ్లీషు మాసపత్రిక మరియు సూర్యోదయం పుదుచ్చేరిలోని స్థానిక పత్రికను అతడు కూర్చి ప్రచురించాడు. పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం కాగితం సరఫరా చేయడం ఆపివేయడం ద్వారా బ్రిటిష్ వారు భారతి నెలకొల్పిన సంస్థలను అణిచేయాలని చూశారు. ఇండియా మరియు విజయ పత్రికలను బ్రిటిషి ఇండియా 1909లో నిషిధించింది.

తన ప్రవాసంలో అరబిందో, లజపతరాయ్ మరియు వివిఎస్ అయ్యర్ వంటి భారత స్వాతంత్ర్యోద్యమంలోని విప్లకకర వర్గం నేతలను కలిసే అవకాశం దక్కింది. వీరిలో అయ్యర్ ఫ్రెంచి వారివద్ద ఆశ్రయం పొందాడు. భారతి Arya పత్రికలో తర్వాత పాండిచ్చేరిలో కామ యోగి పత్రికల నిర్వహణలో అరవిందోకు బాసటగా నిలిచాడు.

1918 నవంబర్‌లో కడలూరు సమీపంలో బ్రిటిష్ ఇండియా భూభాగంపై భారతి అడుగుపెట్టాడు, పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 14 వరకు మూడు వారాలపాటు కడలూరు కేంద్రకారాగారంలో అతడిని నిర్బంధించారు. అదే సంవత్సరం భారతి మోహన్‌దాస్ కరంచంద్‌ని కలిశాడు.

ఇతడి కవిత్వం ప్రగతిశీల భావాలతో, సంస్కరణాత్మక ఆలోచనలను వ్యక్తపరుస్తుంది. అతడి పద్యాలలో వెల్లడయ్యే తన ఊహ, శక్తి అనేక విధాలుగా తమిళ సంస్కృతిని తలపిస్తుంది. మరింత స్వాతంత్ర్యాన్ని, మహిళలను గౌరవించడం అనే గుణాలకు భారతీయార్ విశేష కీర్తి సాధించాడు:

నైతిక పతనాన్ని మనం నాశనం చేస్తాం

స్త్రీత్వం విలువను తగ్గించే భావాలను మనం అణిచివేస్తాం.

హిందూ సమాజంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా భారతి పోరాడాడు. స్వయంగా సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, తన కులానికి సంబంధించిన గుర్తింపును అతడు పదిలివేశాడు. అతడు చెప్పిన గొప్ప సూక్తులలో ఇది ఒకటి 'ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయి: ఒకరు చదువుకున్నవారు మరొకరు చదువులేనివారు. ప్రాణులన్నీ సమానులే అని అతడు గుర్తించాడు. దీన్ని చాటి చెప్పటానికి అతడూ ఒక యువ హరిజనుడికి ఉపనయనం జరిపి అతడిని బ్రాహ్మణుడిని చేశాడు. తన కాలంలో ముసలి ఉపాధ్యాయుల ద్వారా యువతరానికి అందుతున్న తప్పు ధోరణులను కూడా అతడు దుయ్యబట్టాడు. బోధకులు వేదాలు మరియు గీతను బోధించేటప్పుడు తమ స్వంత ఆలోచనలను వాటిలో చొప్పించడాన్ని భారతి బహిరంగంగా విమర్శించాడు.

అనువాదాలు

కుయిల్ పాట్టు - సుజో మత్సుంగాచే జపనీస్‌లోకి అనువదించబడింది (8 అక్టోబర్ 1983)

మరణం

నిర్బంధాలతో భారతి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది, 1920ల నాటికి, సాధారణ క్షమాభిక్ష ఆదేశంతో తన కదలికలపై నిబంధనలు తొలగించేటప్పటికే భారతి బాగా డస్సిపోయాడు. చెన్నయ్, ట్రిప్లికేన్ లోని పార్థసారథి ఆలయం వద్ద అతడిని ఒక ఏనుగు కుమ్మింది. దానికి అతడు క్రమం తప్పకుండా ఆహారం పెట్టేవాడు. ఈ దాడినుంచి అతడు కోలుకున్నప్పటికీ, కొన్ని నెలల తర్వాత ఆరోగ్యం బాగా వికటించింది, చివరకు అతడు 1921 సెప్టెంబర్ 11న కన్నుమూశాడు. భారతి ప్రజాకవే అయినప్పటికీ, ఆతడి అంత్యక్రియలకు కేవలం పద్నాలుగు మంది మాత్రమే రావడం గమనార్హం.

మహాకవి తన చివరి ఉపన్యాసాన్ని ఈరోడ్ లోని కరుంగల్ పాళ్యం లైబ్రరీలో ఇచ్చాడు మానవుడు చిరంజీవి అనే విషయం గురించి ఈ ఉపన్యాసం తడిమింది..

జీవితంలో చివరి సంవత్సరాలను అతడు చెన్నయ్‌లోని ట్రిప్లికేన్‌లో గడిపారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఇంటిని 1993లో కొనుగోలు చేసి పునరుద్ధరించింది, దీనికి 'భారతీయార్ ఇల్లమ్' (భారతీయార్ ఇల్లు) అని దీనికి పేరు కూడా పెట్టింది. జాతీయ కవి జీవితంపై భారతి అనే పేరుతో కొన్నేళ్ల క్రితం ఒక తమిళ చిత్రం రూపొందించారు. ఈ ప్రామాణిక చిత్రాన్ని జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహించారు. సుబ్రహణ్య భారతి ప్రధాన పాత్రను మరాటి నటుడు షియాజి షిండే పోషించాడు.

1 comment: