Breaking News

మార్గదర్శి మనసా స్మరామి


అనేక దేశాల్లో వివిధ సందర్భాల్లో గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారత్ లో ఈ నెల 5న టీచర్స్ డే జరుపుకుంటుండగా, సరిగ్గా నెల రోజుల తరవాత 5 న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పాటిస్తారు. ఐక్యరాజ్య సమితిలోని యునిస్కో ఏటా అక్టోబర్ 5 న వరల్డ్ టీచర్స్ డే ని జరపాలంటూ 1994 లో తీర్మానించింది. యునెస్కో నిర్ణయం మేరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద దేశాలలో వరల్డ్ టీచర్స్ డే ని పాటిస్తున్నారు. ఇలాంటి ఉత్సవాలను మలేషియాలో హరిగురు పేరుతో మే 16 న, ఇరాన్ లో మే 2 న వియత్నాంలో నవంబర్ 20 న, టర్కీలో నవంబర్ 24 న థాయిలాండ్ లో జనవరి 16 న, హాంకాంగ్ లో సెప్టెంబర్ 10 న, అమెరికా లో ఏటా మే నెలలో తోలి మంగళ వారం రోజున నిర్వహిస్తారు. కొన్ని దేశాల్లో ఈ ఉత్సవాల సందర్భంగా విద్యార్ధులు టీచర్ల ఇళ్ళకు వెళ్ళి పుస్పగుచ్చాలు అందజేసి గౌరవిస్తారు. ఇంకొన్ని దేశాలలో విభిన్నంగా ఆ రోజున విద్యార్ధులే పాఠాలు చెబుతూ గురువులతో ఆనందోత్సాహాలను పంచుకుంటారు.

ఎప్పుడూ ఉన్నత స్థానమే....
ఆచార్య దేవోభవ, గురుభ్యో నమః . . . . పూజనీయులైన గురుబ్రహ్మల స్థానం ఎప్పుడూ ఉన్నత శిఖరంపైనే. నడకను నేర్పి, నడతను తీర్చి, బతుకును సరిదిద్దే గురువులకు ఎప్పుడూ అగ్రపీఠమే, గురువంటే గతం, వర్తమానం, భవిష్యత్తు, గురువును గౌరవించడమంటే మన భవితను మనం గౌరవించడం, మన బతుకుల్ని మనం తీర్చిదిద్దుకోవటం. విద్యాబుద్దులు నేర్పిన గురువులకు వందనం, వెలలేని వారి సేవలకు పాదాభి వందనం.

మహాగురువు సర్వేపల్లి

సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడులోని తిరుత్తణి లో 1888 సెప్టెంబర్ 5 న జన్మించారు. పేదరికం వెంటాడుతున్నా స్వశక్తితో ఎదిగారు. ఉపకార వేతనాలపైనే ఆధారపడి ఉన్నత చదువులు పూర్తి చేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఇరవై ఏళ్ల వయసులోనే అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. కోల్కతా, మైసూర్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ గా పని చేసారు. తత్వ శాస్త్రం అంటే ఆయనకు ఎంతో ఇష్టమైనందున ఇండియన్ ఫిలాసఫి పేరిట అద్భుత గ్రంధాన్ని ప్రపంచానికి అందించారు. అధ్యాపక వృత్తి లో విశేష ప్రతిభ చూపి, గురువులకే మహాగురువుగా నిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక తొలి ఉప రాష్ట్రపతిగా, ఆ తర్వాత రెండవ రాష్ట్రపతి గా జాతికి సేవలందించారు, మేటి గురువుగా, తత్వవేత్త గా అంతర్జాతీయ ఖ్యాతితో పాటు ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. 1954 లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు అత్యున్నతమైన భారత రత్న పురస్కారంతో గౌరవించింది. విద్యారంగంలో తనదైన ముద్రవేసుకొన్న ఆయన 1975 ఏప్రిల్ 17 న తుది శ్వాశ విడిచారు.

వెలుగులు పంచి..... విలువలు చాటి....
పాఠ్యాంశాలను బోదించడం వృత్తిగా భావించకుండా, విద్యార్ధులకు క్రమశిక్షణను, ఉన్నత విలువలను నేర్పించేవాడే అసలైన గురువు. విద్యార్ధులను సొంత బిడ్డల్లా చూసుకుని వారిని అన్ని విధాలా తెర్చిదిద్దేందుకు కృషి చేసే గురు బ్రహ్మాలను గుర్తు చేసు కొనే రోజు ఉపాధ్యాయ దినోత్సవం వృత్తిపరంగా సవాళ్ళకు ఎదురీది, సృజన చూపి, విలక్షణ బోదనతో అంకితమయ్యేవారే అసలు సిసలు గురుదేవులు వెలుగులు పంచి విలువలు చాటే ప్రతీ గురువూ మార్గాదర్శే. పరమపవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేవారు చిత్త శుద్ధితో, అంకిత భావంతో – విద్యార్ధులను తిర్చిదిద్దడమే తమ ఏకైక లక్ష్యంగా భావించాలి. తాము కూడా విలువల్ని పాటిస్తూ విద్యార్ధులను సన్మార్ఘంలో నడిపేందుకు మార్ఘదర్శకం కావాలి. అపుడే సమ సమాజ నిర్మాణానికి అవకాశం ఉంటుంది. అలా జరిగినపుడే ఉపాధ్యాయులకు సమాజంలో అత్యున్నత మర్యాదలు లభిస్తాయి.

రచయిత: ఎస్ ఆర్.
పంపినవారు : బొద్దపు సాయి కుమార్, ఎలమంచిలి-విశాఖ జిల్లా.

4 comments:

  1. మార్గదర్శి మనసా స్మరామి.

    ReplyDelete
  2. Hi frnds 05-09-2014 TEACHER S DAY SPECIAL

    ReplyDelete
  3. velugulu panchi-viluvalu chaati ane sandesham baga raasaaru.

    ReplyDelete
  4. Thanks for posting mr. saikumar.

    wonderful essay. it is useful to students who are going to write an essay in competitions.

    ReplyDelete