సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితంలో ఒక సంఘటన
సర్వేపల్లి రాధాక్రిష్ణ రాష్ట్రపతిగా 1962లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ,మాన్వత్వం లేని చైనా దొంగ చాటుగా యుద్ధానికి దిగింది. ఆయన పదవీకాలంలోనే 1965లో కర్కశ పాకిస్తాన్ దాడి చేసింది.ఈ రెండు యుద్ధ సమయాల్లో కీలక పాత్రను ఆయన పోషించారు.రష్యా కు వెళ్ళి స్టాలిన్ తో మాట్లాడిన తీరు, నిరంకుశుడు స్టాలిన్ లో గొప్ప మార్పు ను తెచ్చింది. రక్తపాతం సృస్టించిన రాజు అశోకుడు,ఆ తరువాత బౌద్ధం లోకి మారిన సంఘటన చెప్పగానే స్టాలిన్ లో అనుకోని మానవత్వం పరిమళించింది. స్టాలిన్ మాట్లాడుతూ 'మీరు కలకాలం జీవించాలని, తాను త్వరలోనే మరణిస్తాననీ అంటాడు. ఆ తరువాత 6నెలలకు స్టాలిన్ మరణిస్తాడు.స్టాలిన్ లో మానవత్వాన్ని నింపిన రాధాక్రిష్ణన్ గొప్పతనం మనకు అర్థమవుతుంది. 20సంవత్సరాల వయస్సులోనే ఎం.ఎ.ఫిలాసఫీ పూర్తిచేసాడు. ఆంధ్ర మరియు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయాలకు ఉపకులపతి గా వుంటూ విద్యా రంగానికి ఎనలేని సేవ చేశాడు.సెప్టెంబర్ 5న(1888)జన్మించి,ఏప్రిల్ 17,1975లో పరమపదించాడు.రామాయణం,భారతం,ఉపనిషత్తులు,భగవద్గీత,శంకర,రామానుజ,మధ్వాచార్యుల రాసిన భాష్యాలను అధ్యయనం చేసి నిష్ణాతుడయ్యాడు.
ఆయన పుట్టినరోజు మనకు ఉపాధ్యాయ దినం.
శ్రీ గురుభ్యొనమహ.
- శ్రీ అప్పాల ప్రసాద్
సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితంలో ఒక సంఘటన.
ReplyDelete