Breaking News

భారత్ కు గాంధీ ఆగమనం


మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారత దేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం, కూలీల పట్ల వివక్షనూ వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించాడు. ఈ ఆందోళనల సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు. దీనికి స్ఫూర్తి పంజాబ్ ప్రాంతంలో 1872 లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం. ఈ ఉద్యమాలు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకుంది.

ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగివచ్చిన గాంధీకి ఇక్కడి పరిస్థితులు, రాజకీయాలు కొత్త. అప్పట్లో కాంగ్రెస్ కావాలని అడుగుతున్న ఉమ్మడి వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్ధించాడు. ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి అప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భావించాడు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతయైన గోపాలక్రిష్ణ గోఖలే గాంధీకి మార్గదర్శకుడిగా మారారు. గాంధీజీ ప్రతిపాదించిన అహింసా పూరిత సహాయ నిరాకరణ ఉద్యమం మొదట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు. గాంధీ మాటల్లో చెప్పాలంటే సహాయ నిరాకరణ అంటే అధర్మపూరితమైన ప్రభుత్వ పరిపాలనను నిరసిస్తూ పౌరులు తమ వెల్లడించే అభిప్రాయం. దాన్ని అహింసాయుతంగా నిర్వహించాలి". అలా గాంధీ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్నో లక్షలమంది సామాన్య ప్రజల్లో స్పూర్తి రగిల్చగలిగాడు.

గాంధీజీ దూరదృష్టి ఎంతో మందిని జాతీయ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోకి ఆకర్షించింది. ఈ ఉద్యమంలో భారతీయ వృత్తులు, పరిశ్రమలు వాటి మీద ఆధారపడి జీవితున్న ప్రజల పరిరక్షణ కూడా ఒక భాగం. ఉదాహరణకు బీహార్ లోని చంపారన్ లోవాణిజ్య పంటలను బలవంతంగా పండించమని పేదరైతులను బలవంతం చేస్తూ, వారి నుంచి అన్యాయంగా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ వారికి ఆహార ధాన్యాలు కూడా సరిగా అందుబాటు లో లేకుండా చేసే ప్రభుత్వ విధానాలపై పోరాడి విజయం సాధించారు.

రౌలట్ చట్టం దాని తదనంతర పరిణామాలు
1919 లో చేయబడిన రౌలట్ చట్టం సంస్కరణల సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్వతిరేకంగా జరిగిన హిందూ-జర్మన్ కుట్ర, భారతదేశంలో మొదలయిన సాయుధ పోరాటాలలో జర్మన్ మరియు బోల్ష్విక్ ల పాత్ర ల పై విచారణచేయటానికి సాంమ్రాజ్య విధాన మండలి (ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్)చే నియమించ బడిన రౌలట్ అధికార సంఘం (రౌలట్ కమీషన్) సిఫార్సులకణుగుణంగా రౌలట్ పేరుపై ఈ చట్టం చేయబడినది. చీకటి చట్టంగా పరిగణింపబడిన రౌలట్ చట్టం వైస్రాయి ప్రభుత్వానికి కుట్రని విచ్ఛినం చేయటానికనే సాకుతో వార్తాపత్రికలపై ఆంక్షలువిధించటం, రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే బహిష్కరించటం, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతునారనే అనుమానంపై ఏ వ్యక్తినైనా ధృవీకరించకనే నిర్భంధించటం లాంటి విశేష అధికారాలను దకలు పరిచింది. ఈ చట్టానికి నిరసనగా హర్తాళ్ కి పిలుపునివ్వటంతో దేశవ్యాప్తంగా కాక పోయినప్పటికీ విస్తృతంగా వ్యతిరేకత ప్రభలింది..

1919 ఎప్రల్ 13న ఈ ఆందోళనలకు పరాకాష్ఠగా జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది, ఈ దురంతానికే అమృత్సర్ మారణకాండ అని కూడా పేరు. పంజాబ్ లోని అమృత్సర్ లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపటానికి నాలుగు గోడల మధ్య జలియన్ వాలాభాగ్ లో సమావేశమైన 5000 మంది అమాయక నిరాయుధ ప్రజలపై రెజినాల్డ్ డైయ్యర్ అనే బ్రిటీష్ సైనికాధికారి ప్రధాన ధ్వారాన్ని మూసివేసి విచక్షణా రహితంగా కాల్పులకు ఆదేశించాడు. మొత్తం 1,651 మార్లు చేసిన కాల్పులలో 379 మంది ప్రజలు మరణించారని 1,137 మంది గాయపడినారని బ్రిటీష్ వారి అధికారిక అంచనా. అయితే మొత్తం 1,499 మందిదాకా మరణించారని భారతీయుల అంచనా.ఈ దారుణ మారణకాండతో స్వపరిపాలనపై మొదటి ప్రపంచ యుద్ధసమయంలో భారతీయులలో చిగురించిన ఆశలు అడియాశలైనాయి.

సహాయ నిరాకరణోద్యమాలు
మొదటి ప్రపంచ యుద్ధసమయంలో జరిగిన మొదటి స్వాతంత్ర్యోద్యమము వ్యాపారాత్మక ప్రదేశాలకే పరిమితమై దేశ ఏకీకరణకు పిలుపునివ్వక సామాన్య ప్రజలకు దూరంగానే నిలిచిపోయిందని చెప్పవచ్చు. 1930వ దశకంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారత రాజకీయాలలోకి ప్రవేశించటంతో దేశ ఏకీకరణ ప్రారంభమైనది.

మెదటి సహాయ నిరాకరణోద్యమము
మెదటి సత్యాగ్రహ ఉద్యమము బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే మిల్లు వస్త్రాలకు మారుగా భారతదేశంలో తయారయిన ఖద్దర్ని ఉపయోగించాలని పిలుపునిచ్చింది, అదియే కాక బ్రిటీషు విద్యాసంస్థలను మరియు న్యాయస్థానాలని బహిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను విడనాడాలని, పన్ను చెల్లింపులు నిలిపివేయాలని, బ్రిటీష్ వారి సత్కారాలను, బిరుదులను తిరస్కరించాలని పిలుపునిచ్చింది. 1919 లో చేయబడిన నూతన భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రభావితం చేయటంలో చాలా ఆలస్యంగా ప్రారంభమైన సత్యాగ్రహోద్యమము విఫలమైనప్పటికీ భారత దేశంలో విస్తృత ప్రజాదరణ పొందింది. తత్ఫలితంగా పెద్దయెత్తున పాలనను స్తంభింపజేసి విదేశీ పాలనకు తీవ్రమైన ఒడిదుడుకులను కలిగించింది.అయితే ప్రజాగ్రహానికి గురియై 21 మంది రక్షకబటులు మరణించిన చౌరి చౌరా సంఘటనతో గాంధీ మెదటి సత్యాగ్రహోద్యమాన్ని విరమించాడు.

1920 లో కాంగ్రెస్ ను పునర్వవస్థీకరించి నూతన విధివిధానాలు రూపొందించారు. స్వరాజ్యం వీటి లక్ష్యం.కాంగ్రెస్ సభ్యత్వనమోదు సరళీకరింపబడి నామమాత్రపు రుసుము చెల్లించటానికి అంగీకరించిన వారందరికీ అందుబాటులోకి పచ్చింది. స్వేచ్ఛాయుత విధానాల స్థానే నిర్ధిస్ట నియంత్రణ కలిగి క్రమశిక్షణను పెంపొదించేందుకు అనేక స్థాయిలలో సంఘాలను ఏర్పరిచారు. వీటన్నిటి ఫలితంగా శిష్ఠజన వర్గాలకే పరిమితమైన సంస్థ నుండి జనాధరణ మరియు జన భాగస్వామ్యం గల రాజకీయ పక్షంగా కాంగ్రెస్ రూపాంతరం చెందింది.

1922 లో గాంధీకి ఆరుసంత్సరాల కారాగార శిక్ష విధించారు, కానీ రెండు సంవత్సరాల కారాగార వాసానంతరం విడిచి పెట్టారు. కారాగారవాసం తరువాత గాంధీ సబర్మతీ నదీ తీరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. అచటినుండి యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నడపటంతో పాటు హిందూ సమాజంలో వెనకబడిన, దళిత, అస్పృశ్య, పేద ప్రజల కోసం అనేక సంఘ సంస్కరణలను ప్రారంభించారు.

ఈ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి క్రొత్త తరం ప్రవేశించింది. చక్రవర్తి రాజగోపాలాచారి, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ వీరిలో కొందరు. తరువాతి కాలంలో వీరు గాంధేయవాద విలుపలననుసరించినా వాటితో విభేదించినా (భారత జాతీయ సైన్యం) భారత స్వాతంత్ర్య వాణిని స్పష్టంగా వినిపించారు.

భారత రాజకీయాలు స్వరాజ్య పార్టీ, హిందూ మహాసభ, కమ్యూనిస్ట్ పార్టి ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి అనేక మితవాద, అతివాద సంస్థల ఆవిర్భావంతో విస్తృతమయ్యాయి. మద్రాసులో బ్రాహ్మణేతరుల, మహారాష్ట్రలో మాహరుల, పంజాబులో సిక్కుల ప్రయోజనాలకు ప్రాంతీయ రాజకీయ పక్షాలు ప్రాతినిధ్యం వహించాయి. మహాకవి సుబ్రమణ్య భారతి, వన్చినాథన్ మరియు నీలకండ బ్రహ్మచారి వంటీ బ్రాహ్మణ ప్రముఖులు కూడా తమిళనాడులో స్వాతంత్ర్య సాధనకు మరియు అన్ని కులాల ప్రజల సమానత్వానికై పోరాడారు.

1 comment: