అంబ ఓ జగదంబ - Amba O Jagadamba Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
అంబ - ఓ జగదంబ
అన్నీ జీవుల్లో ఎన్నో రూపాల్లో
కొలువై ఉన్నావు -మాయకదా
విష్ణు మాయకదా
అంబ - జగదంబ
చింత శోకమునిచ్చి దుఃఖ పీడనిచ్చి
సంబరాలే ఇచ్చి, దీనత్వం ఇచ్చి
అతీ ఉత్సాహం,భీతి, తత్తరపాటు
చిత్తవృత్తూలిచ్చి మాయ కల్పిస్తావు
అంబ- ఓ జగదంబ
అన్నీ జీవుల్లో ఎన్నో రూపాల్లో
కొలువై ఉన్నావు -మాయకదా
విష్ణు మాయకదా
అంబ - ఓ జగదంబ
బుద్దివై వస్తావు నిద్రవై వస్తావు
ఆకలై వస్తావు నీడవై వస్తావు
శక్తి రూపంపొంది ,కోరికై వస్తావు
అపకారికైనా ఉపకారం చేస్తావు
జీవరాసూలల్ల ప్రాణమై వస్తావు
సిగ్గూవడుతుంటవు శ్రద్దా చూపిస్తవు
అమ్మ లేని తావు లేనేలేదయా
అమ్మ పాదాలకు రోజూ మొక్కాలయ్యా
అంబ- ఓ జగదంబ
అన్నీ జీవుల్లో ఎన్నో రూపాల్లో
కొలువై ఉన్నావు -మాయకదా
విష్ణు మాయకదా
అంబ - ఓ జగదంబ
సిగ్గూపడుతుంటవు శాంతంగుంటావు
సకల ప్రాణుల్లో శ్రద్ధవై వచ్చి
కాంతివై వెలుగిచ్చి లచ్చిమీ మా కిచ్చి
పనులల్ల నువ్వొచ్చి జ్ఞాపకంలా వచ్చి
దయ కలిగుంటావు తృప్తిఅందిస్తావు
తల్లి రూపంలో,ఊహా భ్రమల్లో
సుట్టూ లోకంలో సర్వ జీవుల్లో
ఆధార దేవతై అంతట ఉంటావు
ఓ జగదంబా వేల దండాలమ్మా
అంబ- ఓ జగదంబ
అన్నీ జీవుల్లో ఎన్నో రూపాల్లో
కొలువై ఉన్నావు -మాయకదా
విష్ణు మాయకదా
అంబ - ఓ జగదంబ
భక్తులను బ్రోవా సౌమ్యంగా ఉంటవు
దుష్టులను దునుమా రౌద్రంగా ఉంటవు
ప్రకృతివీ నీవే- పాలన పోషణనీవే
ప్రళయాన్ని తెచ్చి,సృష్టిని ముంచేసి
యోగ నిద్ర దాల్చి,పునర్ సృష్టి చేసే
ఆది శక్తి దండం - మహాశక్తి దండం
సకల దేవతా శక్తి - దుర్గమ్మకు దండం
అంబ- ఓ జగదంబ
అన్నీ జీవుల్లోన ఎన్నో రూపాల్లో
కొలువై ఉన్నావు -మాయకదా
ఇది విష్ణు మాయకదా
అంబ - ఓ జగదంబ
No comments