లక్ష్మీ నర్సింహా జ్వాలా నర్సింహా - Sri Lakshmi Narasimha Swami Telugu Bhajana Songs
రచన - అప్పాల ప్రసాద్
లక్ష్మీ నర్సింహా - జ్వాలా నర్సింహా
ప్రహ్లాదుని గాచిన ఉగ్ర నర్సింహా
ఇలలోన జన్మించి
పాపాలు చేస్తినయా
కొన్నేమో తెలిసిచేసితి
తెలియక చేసినవెన్నో
భయమొంది బాధచెంది
నీ చాటున చొచ్చినాను
కష్టములలో నన్నేలుకొ
కల్మషాలు కడిగేయరా
లక్ష్మీ నర్సింహా - జ్వాలా నర్సింహా
ప్రహ్లాదుని గాచిన ఓ ఉగ్ర నర్సింహా
తల్లీ గర్భము నందు
పుట్టీనప్పటి నుండి
పుణ్యమసలె ఎరుక లేదు
తీర్థ యాత్ర చేయలేదు
ఏకాదశీ వ్రతం నాడు
ఉపవాసం ఉండలేదు
నీ శరణం చేరినాను
నాకు దారి చూపించరా
లక్ష్మీ నర్సింహా - జ్వాలా నర్సింహా
ప్రహ్లాదుని గాచిన ఓ ఉగ్ర నర్సింహా
ఒక్కనికైనా నేను
బిక్ష పెట్టనేలేదు
జ్ఞానవంతులైనా
నే గౌరవించనే లేదు
ఎవ్వరికైనా గాని
దానమివ్వనే లేదు
నీ పాదం పట్టుకున్న
శీఘ్రముగా రక్షించరా
లక్ష్మీ నర్సింహా - జ్వాలా నర్సింహా
ప్రహ్లాదుని గాచిన ఓ ఉగ్ర నర్సింహా
No comments