Breaking News

నా ఆలోచన జ్ఞానం వైపు - Naa Alochana Jnanam Vaipu Song Lyrics in Telugu

 రచన - అప్పాల ప్రసాద్


నా ఆలోచన జ్ఞానం వైపు 

పరుగులన్ని పరమాత్ముని వైపు 

అమరత్వం వైపందరి ఆత్మలు సాగిపోవాలి 


సౌందర్యం వైవిధ్యంలోన 

ఏకత్వం భిన్నత్వంలోన 

అంతర్ముఖులై లోలోపల అన్వేషించాలి 


నీలో నాలో అంతర్యామి

అన్నిటిలోనూ ఆత్మతత్వం 

ధ్యానముద్రలో దర్శించిన వారెందరెందరో 

అండపిండబ్రహ్మాండం నిండి 

ఆత్మీయత నిండుగ ఉండి 

బంధుత్వం మా విశాలభావం సాగిపోదాం 


నా ఆలోచన జ్ఞానం వైపు 

పరుగులన్ని పరమాత్ముని వైపు 

అమరత్వం వైపందరి ఆత్మలు సాగిపోవాలి 


సౌందర్యం వైవిధ్యంలోన 

ఏకత్వం భిన్నత్వంలోన 

అంతర్ముఖులై లోలోపల అన్వేషించాలి 


సత్యం ఒకటే మార్గాలెన్నో 

ఎన్నో నదులు సంద్రం ఒకటే

అభాగ్యజీవుల సేవలుజేసి తరించిపోదాము 

శరణార్థులకిది ఆశ్రయ స్థానం 

ముల్లోకాల్ నా మూలస్థానం 

నివసించే నా ప్రజలందరితొ స్నేహం చేద్దాము 


నా ఆలోచన జ్ఞానం వైపు 

పరుగులన్ని పరమాత్ముని వైపు 

అమరత్వం వైపందరి ఆత్మలు సాగిపోవాలి 


సౌందర్యం వైవిధ్యంలోన 

ఏకత్వం భిన్నత్వంలోన 

అంతర్ముఖులై లోలోపల అన్వేషించాలి


దేవత రూపాలెన్నో వున్నా 

శక్తి స్వరూపం ఒకటేనన్న 

ఆవాహనతొ ఆస్వాదించి ఆరాధిద్దాము 

సత్యాన్వేషణ మార్గాలెన్నో 

పరమ సత్యం ఒకటేనన్నా 

సర్వపంథ సమాదరభావం సమరసతాధారం 


నా ఆలోచన జ్ఞానం వైపు 

పరుగులన్ని పరమాత్ముని వైపు 

అమరత్వం వైపందరి ఆత్మలు సాగిపోవాలి 


సౌందర్యం వైవిధ్యంలోన 

ఏకత్వం భిన్నత్వంలోన 

అంతర్ముఖులై లోలోపల అన్వేషించాలి

No comments