Breaking News

సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం - Sanghatanam Oka Yagnam Song Lyrics in Telugu


 

సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం  || సంఘటనం ||

గలగల పారే  ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా
మిల మిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా   
తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం   || సంఘటనం ||

భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా
ఆజన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా
ఆనామికత సందేశం హైందవ జీవన సారం
జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం   || సంఘటనం ||

మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై
కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై
కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
జయ జయహే మాతరం జయం జయం భారతం  || సంఘటనం ||

1 comment:

  1. సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం

    ReplyDelete