Breaking News

అమ్మ భారతి అందుకో మా హారతి - Amma Bharathi Song Lyrics in Telugu

 రచన, గానం - అప్పాల ప్రసాద్ గారు

సంగీతం - రాజా



అమ్మ భారతి అందుకో మా హారతి 
అందరమొకచోట నిలిచి పాడెదమీ కీర్తి గీత...

1. భయపడేది లేదెవరికి కాగడ చేబూనుదాం 
అంబరాన్ని అంటి, భూమి నలుచెరుగుల చేరుదాం
చీకట్లను పారద్రోలి, దివ్యజ్యోతి నింపుదాం 
విజయం మనదేనంటూ జయకేతనమెత్తుదాం    || అమ్మ భారతి ||


2. విలువల  బాంధవ్యాలను తెలిపే మన కుటుంబం 
అందరినీ ప్రేమించే ఆటపాటలానందం 
ఇల్లే గుడి, చదువులబడి, అమ్మ ఒడియే పావనఝరి 
కష్టసుఖం  కలగలిపి, కలసిమెలసి సాగుదాం       || అమ్మ భారతి ||


3. శక్తి సంభరితమైన శివసుందర పుత్రులం 
హృదయ సంజనితమైన దేశ భక్త పౌరులం 
మనమంతా భక్తి, జ్ణాన, కర్మయోగ కిరణాలం 
మనమంతా త్యాగసేవ  సద్గుణాల సేవకులం          || అమ్మ భారతి ||

4. వివేకుని సేవాపథ నివేదితల వారసులం
మానవతా పరిమళాలు వెదజళ్లే కుసుమాలం 
వసుంధరా శాంతి, ధర్మ  స్థాపనకై కదలుదాం 
భరత మాత గౌరవాన్ని జగతిలోన నిలుపుదాం     || అమ్మ భారతి ||

No comments