చరితలోని సారమిదే భవితలోని భావమిదే - Charitaloni Saramide Song Lyrics in Telugu
చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం అంటోంది మా తరం
అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద
సమర్ధుల సందేశం వందే మాతరం
ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ
రాణా రక్తపు శౌర్యం వందే మాతరం
ఝాన్సి రాణి రుద్రమాంబ కత్తుల కథలే || వందే మాతరం ||
మనలోని అనైక్యత సంస్కార విహీనత
ఆసరాగా అధికారం అందుకోనిరిరా
విద్వేషం రగిలించి విభజించి పాలించి
విద్రోహం తలపెట్టె ఫిరంగి ముకరా
బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం || వందే మాతరం ||
పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు
దోపిడీలు హింసలకే అంతం లేదా
మతవాదులు ఉన్మాదులు మారని పెడ ధోరణీలు
దానవత్వ పోకడ ప్రమాదమే కాదా
సమస్యలెన్ని వున్నా గాని సాధనమోకటే || వందే మాతరం ||
ఎన్నాళ్ళి వేదనా ఎన్నాళ్ళి రోధనా
తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా
వీరవ్రత సారధివై విశ్వ శాంతి వారధివై
విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగువై
విజయ శంఖమెత్తి పాడు భున భోంతరం || వందే మాతరం ||
చరితలోని సారమిదే భవితలోని భావమిదే
ReplyDeleteThanks u singers and writers giving us these good lyrics
ReplyDelete