Breaking News

డా.అంబేద్కర్ - బౌద్ధం లోకి ప్రవేశం వెనక కారణం?

డా అంబేద్కర్ హిందూ సమాజానికి ఒక షాక్ ఇవ్వాలనుకుని 1935 లో ఒక ప్రకటన చేస్తూ తాను హిందూ మతం లో పుట్టినా, ఈ మతం లో చావనని అన్నాడు..

ఆయన గురువైన గాడ్గే బాబా వద్దకి వెళ్ళి ఆయన అభిప్రాయం చెప్పమని అంబేద్కర్ అడిగాడు..నాకు చదువు పెద్దగా రాదని, నీవేమో బాగ చదువుకున్నవాడివి ..నేనేమి చెప్పగలను అంటూనే...హిందూ ధర్మానికి హాని కలగకుండా ఏదీనా చేయమని సలహా ఇచ్చాడు.
బాబూ జగజీవన్ రాం, అంబేద్కర్ ని మతం మారవద్దని సూచన చేశాడు.

ఆర్ ఎస్ ఎస్ పూర్తి సమయ కార్యకర్త దత్తోపంత్ ఠెంగ్డి తన బాధ వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుండి భాగ్యరెడ్డి వర్మ ద్వార వెళ్ళిన వెంకట్రావ్ అంబేద్కర్ ని కలిసి హిందూ మతం వీడొద్దని చెప్పాడు.

అంగ్లేయులు, ఆర్చ్ బిషప్ లు అంబేద్కర్ ని కలిసి క్రైస్తవం లో చేరాలని, ఆంగ్ల ప్రభుత్వం లో ఉన్నత పదవులు ఇస్తామని ప్రలోభపరిచారు.

నిజాం నవాబ్ కోట్ల రూపాయలు ఆశ చూపి ముస్లిం మతం లొ చేరి, హిందువులపై పగ తీర్చుకుందామని వివరించారు. 

ఇవన్నీ విన్నాడు..గమ్మత్తేమిటంటే 1935 లో ప్రకటించి, సుమారు 21 సంవత్సరాలు వేచి చూశాడు డా.అంబేద్కర్.ఆ తరువాత అక్టోబర్ 14,1956 లో బౌద్ధాన్ని స్వీకరించారు. 

21 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసారు.?1956 సంవత్సరాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

ఇన్ని సంవత్సరాల తరువత కూడా హిందూ సమాజ పెద్దల్లో చెపుకో తగిన మార్పు  రాలేదు..తనకేమో వృద్ధాప్యం వచ్చెసింది..అంతేనా? ప్రపంచమంత విస్తరిస్తున్న కమ్యూనిజం భారత్ లో తన పంజా విప్పింది.కమ్యూనిజపు విషపు కౌగిట్లోకి దళితులను పోకుండా, హింసాత్మక చర్యలకు పాల్పడే కమ్యూనిష్టుల పంచన చేరకుండా తన తోటి ప్రజలకు శాంతి, దయ, ప్రేమ లను అందించే బుద్ధమతమె సరియైనదని భావించారు.తన అనుచరులకు , ముఖ్యంగా గాంధిజి కి ఉత్తరం వ్రాస్తూ , హిందూ సమాజానికి తక్కువ నష్టం కలిగే విధంగా , అలాగే హిందు భూమిలొ ఒక భాగమైన బౌధం లో చేరుతానని ప్రకటించాడు.విదేశీ భావజాలాల క్రైస్తవం, ఇస్లాం తన వారికి ఆమొద యొగ్యం కాదని, అలా చేస్తే దేశ వ్యతిరేకులుగా మారుతారని తెలియ చేశాడు.

అంతే కాని డా అంబేడ్కర్ హిందూ సంస్కృతిపైన విష విద్వేషాలు వెలిగక్కలేదు..

(డా అంబేద్కర్ హిందు మతం వదలిపెట్టాడు. కాబట్టి,ఇప్పటి హిందు సమాజం లో వస్తున్న మంచి మార్పులను చూసి న తరువాత కూడా,  హిందూ ధర్మానికి నష్టం వాటిల్ల చేయాలన్న దురాలోచనతో మాత్రమే, దళితులను ఎటూ చేసి, హిందు మతాన్నుండి దూరం చేసి, క్రైస్తవం లో కి మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇలా అంబేద్కర్ పేరు చెప్పి దళితులను గందర గోళ పరిచి, వాళ్ళను బలి పశువులను చేసి ఆడుకుంటున్న తీరు తెలంగాణా లో అందరికి కొట్ట వచ్చినట్లు కనపడుతున్నది..వీళ్ళ చర్యల వళ్ళ, దళితుల అభివృద్ధి పక్కన పెడితే ఈ నాయకుల స్వార్థ రాజకీయాలకు మాత్రం తప్పక ఉపయోగపడుతుంది.).
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. డా అంబేద్కర్ హిందూ సమాజానికి ఒక షాక్ ఇవ్వాలనుకుని 1935 లో ఒక ప్రకటన చేస్తూ తాను హిందూ మతం లో పుట్టినా, ఈ మతం లో చావనని అన్నాడు..

    ReplyDelete