Breaking News

దుష్ప్రచార ప్రభావం ఎంతో


1983 లో నేను బర్కత్పుర పి.యఫ్ ఆఫీస్ లో పని చేసేవాడిని. ఏలూరు నుండి ట్రాన్సఫర్ అయ్యి వచ్చాను. నాలుగవ అంతస్తులో పని.

సంఘం నాకు నేర్పిన స్నేహం చేయడం తో అన్ని అంతస్తుల్లో స్నేహితులు అయ్యారు. ముస్లిం ఉద్యోగస్తులు కూడా స్నేహితులయ్యరు.‍‍ మా ఫ్లోర్ లో ఒక ముస్లిం సోదరుడు చాలా దగ్గరయ్యాడు.

తాను ఆధ్యాత్మిక విషయాలను ఆలోచిస్తానని, అప్పట్లో హిందు పేపర్ లో చివరి పేజీ లో వచ్చే ఆధ్యాత్మిక విషయం తెచ్చి చెప్పేవారు. నేనూ నా అభిప్రాయం ఉత్సాహంగాచెప్పేవాడిని.


నాకు సిగరెట్ లాంటి అలవాట్లు, మరొకరిని ఎక్కిరంచే అలవాట్లు లేక పోవడం ఒక క్వాలిఫికేషన్. నాకంటే పెద్దవారు కూడా నాతో మాట్లాడటం లో విసుగు అనుకునేవారు కారు. ఒక పెద్దాయన మన కుల సంఘానికి కార్యదర్శి గా ఉండాలని కూడా అడిగారు.

ఒక సారి నేనూ, మా ముస్లిం మిత్రుడు మాట్లాడు కుంటుంటే రామ సుబ్బారెడ్డి అక్కడికి వచ్చి మీ RSS వాళ్ళ కార్యక్రమం ఏదో నిన్న జరిగిందటగా, నీవు వెళ్లావా? అని అడిగాడు. అవును, వెళ్లాను, అన్నాను. వెంటనే ముస్లిం‌మిత్రుడు, నీవు RSS నా అని అడిగాడు. నేను అవును అన్నాను. మీరు మాట్లాడుకోండి, అంటూ తన సీటుకు వెళ్లాడు.
అతను‌మాట్లాడటం తగ్గించాడు. తరువాత నేనే అతని సీటు దగ్గరకు వెళ్లి సంఘం అంటే దేశభక్తుల సంస్థ అని చెప్పాను. నేను విన్నది వేరు నీవు చెప్పేది వేరు. మీకు ముస్లిమ్స శత్రువులుగా చూస్తారు కదా! అన్నాడు. రోజూ మనం మాట్లాడు కునేవారం కదా! అలా ఎప్పుడైనా అనిపించిందా? అడిగాను. లేదనే అన్నాడు. మరి నేను చెప్పేదానిపై ఎందుకు అనుమానం? అతని నోట మాట రాలేదు. కాని తరువాత అదివరలోలా లేడు. తరువాత కొద్ది కాలానికి నేను ప్రచారక్ గా వెళ్లాను. 

అతని అనుమానం తీరి ఉంటే సంతొషమే. ఒక మంచి పిల్లవాడు RSS లోకి వెళ్లపోయాడని చాలా మంది సానుభూతి పలికారు. దుష్ప్రచార ప్రభావం ఇంత ఉంటుంది. ప్రక్క వాడిని కూడా నమ్మరు. నిన్న tvలో ఒక కమ్యునిష్టు 
సంఘ సమావేశాల్లో చంపడం, నరకడం మాట్లాడు కుంటారని చెబితే‌దాని ప్రభావం ఎంత ఉంటుందో ఊహించ వచ్చు.
- నరసింహా మూర్తి.

1 comment:

  1. సంఘం నాకు నేర్పిన స్నేహం చేయడం తో అన్ని అంతస్తుల్లో స్నేహితులు అయ్యారు. ముస్లిం ఉద్యోగస్తులు కూడా స్నేహితులయ్యరు.‍‍ మా ఫ్లోర్ లో ఒక ముస్లిం సోదరుడు చాలా దగ్గరయ్యాడు.

    ReplyDelete