Breaking News

విద్యార్థిపరిషత్ శిబిరం హిందుకాలేజిలో

నేను గుంటూరు లో ఉండగా విద్యార్థి‌ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహా సభలు జరిగాయి. హిందూ కళాశాల పూర్తిగా తీసుకోబడినది. అన్ని క్లాసు రూములూ వసతికే.
అప్పుడు శ్రీ షణ్ముఖ గారు ఆ విభాగ్ పని చూసేవారు. విజయవాడలో శ్రీ ప్రేమేందర్ గారు ఉన్నారనుకుంటా.‌ స్వర్గీయ గౌరీశంకర్జి స్టేట్ సంఘటనా మంత్రి. వారు చాలా అప్యాయంగా పలుకరంచేవారు. స్థానిక‌ కార్యకర్తగా ప్రబంధ వ్యవస్థ అంతా షణ్ముఖ గారి పైనే పడింది. అందులో వ్యవస్థలన్నీ విద్యార్థులే చూసుకున్నారు. రక్షణ వ్యవస్థ మాత్రం స్వయంసేవకులకు అప్పజెప్పారు. బౌద్దిక్ మండపం ముందు‌గ్రౌండు‌లో వేసారు. ఏకా దండయ్య హాలు కూడా ఉండింది.
చలసాని నరేంద్ర గారు అక్కడే ఉన్నారు. వారు తీసుకున్న ప్రయత్నాల‌బైఠక్ ఒక దాంట్లో నేనూ ఉన్నాను. రెండు రోజులనుకుంటాను.
అంత మంది విద్యార్థులతో శిబిరం అప్పుడే చూడటం. అద్బుతంగా జరిగింది. నేను సమావేశాలలో‌ కూర్చోలేదు. కాని రక్షణ పని స్థానిక స్వయంసేవకులతో చూసాను.

సమావేశాల స్థలం నుండి బస్టాండు ఒక కి.మీ దూరం. మహాసభలు అయిపోయిన రోజు జిన్నా టవర్ సెంటర్, లీలామహల్ సెంటర్, ‌బస్టాండు అంతా జండాలు, కళాశాల విద్యార్థుల మయం. నినాదాల హోరు.అదొక ఆనంద సమయం.
ఇంటర్ పర్కాల లో పరిషత్ నేను పాల్గొన లేదు. ఇంటర్, డిగ్రి మొదటి సంవత్సరం (న్యూసైన్స్ కాలేజి) ఎమర్జెన్సీ. తరువాత రెండు సంవత్సరాలు ఎలకషన్ల లో పరిషత్ పాల్గొన లేదు. ఆ విధంగా నాకు పరిషత్ పనిలో పాల్గొనే అవకాశమే లేదు. సంఘం, శాఖ మాత్రమే తెలుసు. విద్యార్థులలో అంత శక్తి మనకున్నదని అప్పుడే తెలిసింది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. విద్యార్థిపరిషత్ శిబిరం హిందుకాలేజిలో

    ReplyDelete