Breaking News

హేట్సాఫ్ టు పుల్లాబాయ్



వ్యవసాయం ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు, పురుగుమందులేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతూ వుంటారు. అయితే హరిత విప్లవం తర్వాత ఆరు దశాబ్దాలుగా రసాయనాల వినియోగానికి అలవాటు పడిన రైతులోకం ఆ అలవాటును వదులుకోలేకపోతోంది. దేశవ్యాప్తంగా రసాయనాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగిస్తూనే వుంది. భూములు కూడా రసాయనాలను వినియోగిస్తేనే ఫలసాయం ఇచ్చే స్థితికి చేరుకున్నాయి. ఈ రసాయనాల వినియోగం బాటలోనే గిరిజనులు కూడా పయనిస్తున్నారు. బయటి ప్రపంచమే రసాయనాల ప్రవాహంలో కొట్టుకుపోతోంది. ఇక గిరిజనుల్లో మార్పు రావడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని పలువురు పరిశీలకులు అంటూ వుంటారు. అయితే ఏకలవ్య ఫౌండేషన్ చేస్తున్న కృషి కారణంగా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లోని కొన్ని అటవీ గ్రామాల్లోని గిరిజనులు రసాయన వ్యవసాయాన్ని వీడి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు. వారిలో హేట్సాఫ్ చెప్ప దగ్గ గోండు గిరిజన మహిళ సేడం పుల్లాబాయి.

ఉట్నూరు మండలం మోతుగూడ గ్రామంలో నివసించే గోండు మహిళ సేడం పుల్లాబాయి తనకున్న ఎకరం భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తోంది. ఎకరం భూమిలోనే కూరగాయలతోపాటు చిరు ధాన్యాలను కూడా రసాయన ఎరువులుగానీ, పురుగు మందులు కానీ ఉపయోగించకుండా వ్యవసాయం చేస్తోంది.

ఖర్చు తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ

‘గతంలో నేను కూడా వ్యవసాయం కోసం రసాయనాలనే వాడేదాన్ని. అయితే ఏకలవ్య ఫౌండేషన్ ఆర్గానిక్ వ్యవసాయం మీద మాలో అవగాహన పెంచింది. మా ఊళ్ళో చాలామంది ఇప్పటికీ రసాయనాలనే ఉపయోగిస్తున్నప్పటికీ నేను మాత్రం పూర్తిగా సేంద్రీయ పద్ధతితోనే వ్యవసాయం చేస్తున్నారు. ఈ పద్ధతి కారణంగా వ్యవసాయానికి అయ్యే ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాను. నాలో వచ్చిన ఈ మార్పు మంచికేనని అనిపిస్తోంది..’

– పుల్లాబాయి.

1 comment:

  1. ఉట్నూరు మండలం మోతుగూడ గ్రామంలో నివసించే గోండు మహిళ సేడం పుల్లాబాయి తనకున్న ఎకరం భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తోంది. ఎకరం భూమిలోనే కూరగాయలతోపాటు చిరు ధాన్యాలను కూడా రసాయన ఎరువులుగానీ, పురుగు మందులు కానీ ఉపయోగించకుండా వ్యవసాయం చేస్తోంది.

    ReplyDelete