Breaking News

అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడానికి వెనక ఎవరెవరు వున్నారో చదివితే ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది


అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడానికి వెనక ఎవరెవరు వున్నారో చదివితే ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. " రాజ్యాంగ సభ్యునిగా, వివిధ ఉప సమితుల సభ్యునిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మనదేశం ఇంకా లాభపడాలంటే, జులై 14 నుండి మొదలయ్యే రాజ్యాంగ సభలో అంబేద్కర్ వుండవలసిందేనని, ఆ విషయంలో నేను ఎంతో ఆసక్తి తో వున్నానని డా. రాజేంద్ర ప్రసాద్ , అప్పటి ముంబాయి ముఖ్య మంత్రి బిజి ఖేర్ కి ఉత్తరం వ్రాసారు. అలాగే అంబేద్కర్ ఎంపిక విషయం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యక్షంగా బిజి ఖేర్ తో మాట్లాడారు.

ఆ విధంగా 1947 జులై లొ సభలో ప్రవేశించారు. 1947 లో దేశ విభజన కారణంగా వారు అప్పటికే ఎన్నికైన పశ్చిమ బెంగాల్ లోని ఒక భాగం పాకిస్తాన్ లో కలవడం తో సభలో సభ్యత్వం కోల్పోయారు. ఆ తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ చొరవ తో సభలో ప్రవేశించి, డ్రాఫ్టింగ్ కమిటీ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఇందులో 7 గురు సభ్యులున్నా , ప్రధాన పాత్ర మాత్రం అంబేద్కర్ పోషించారు. సాంఘిక, రాజకీయ ప్రజాస్వామ్యం లేకుండా జాతీయ భావన రాదని, ఒకే సంస్కృతి ని అనుసరిస్తూ నే, భారతీయులందరికి సమాన భాగస్వామ్యం వుండాలని, సమాన సంబంధాలు వుండాలని, సమాన ఆశా ఆకాంక్షలు వుండాలని వారు వందల సంవత్సరాల పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాల కు రిజర్వేషన్ కల్పించి, జాతీయ జీవన స్రవంతిలో కలిపే పనిని విజయ వంతంగా చేశారు. అలాగే అన్ని వర్గాల కు చెందిన మహిళలకు, కార్మికుల కు ఎన్నో హక్కులు కల్పించి అందరి వాడని అనిపించుకున్నారు. 

                                                                                  - అప్పాల ప్రసాద్.

1 comment:

  1. జాతీయ జీవన స్రవంతిలో కలిపే పనిని విజయ వంతంగా చేశారు. అలాగే అన్ని వర్గాల కు చెందిన మహిళలకు, కార్మికుల కు ఎన్నో హక్కులు కల్పించి అందరి వాడని అనిపించుకున్నారు.

    ReplyDelete