Breaking News

నా తృతీయ వర్ష -5

తృతీయ వర్ష లో ఒక రోజు మమ్మల్ని పూజ్య డాక్టర్జీ ఇంటికి తీసు కెళ్లారు. ఇల్లు తూర్పు ముఖ ద్వారం. ఆ తూర్పు వీధి వాళ్ళ ఇంటి వరకే ఆగిపోయింది. తూర్పుకు రెండతస్థులు. దూలాలు, కట్టే స్తంభాలు, పెంకుల రెండవ అంతస్తు. 3 అడుగుల సందులా మెట్లు. పడమరO ఖాళీ. వాయువ్యం లో బావి.
వారి చిన్నప్పటి జీవితం, సంఘటనలు ఎన్ని సార్లు చదివామో! శాఖల్లో చెప్పామో! ఇప్పుడు ప్రత్యక్ష అను భూతి. ఇల్లంతా కలయా తిరిగాము. బాల స్వయంసేవకులతో ఆ పరమపూజ్యుడు కథలు చెప్పుకున్న గది చూసాము దిండ్లతో కొట్టుకుంటూ పిల్లలతో ఆడిన డాక్టర్జీ ని ఊహించు కుని నవ్వుకున్నాం. అంత జ్వలంత దేశ భక్తుడికి, సంఘం ప్రారంభించి 15 సంవత్సరాలలో దేశ వ్యాప్తం చేసిన సంఘటనా కార్యదక్షుడికి పిల్లలతో గడపడానికి అంత సమయం ఉండింది కదా అని ఆశ్చర్యం పడ్డాము. రాయి నుండి శిల్పం తయారు చేసే మానవ శిల్పికి మనుషులతోటే పని కదా అని ఆనంద పడ్డాము.
భోజనం చేసేప్పుడు కూడా తల వాకిలి కనపడే విధంగా కూర్చునే వారంటే వారెక్కడ కూర్చుని ఉండవచ్చు అని వెతుక్కున్నాం. చాయ్ పెట్టడానికి ఇంట్లో టీ పొడి, చక్కెర , పాలు కూడా లేక బాధ పడ్డ వారి వదినగారి వంటిల్లి చూసాము. బావి పూడిక తీయాలని నిర్ణయం చేసి రాత్రికి రాత్రి ముగ్గురు అన్న తమ్ములు వారే శుభ్రం చేసి ఆ బురద రాత్రి బయటకు ఎలా ఎత్తారో అంటూ ముక్కున వేలేసు కున్నాం.
అంత ఎత్తు ఇంటి పై నుండి ఒక హిందువును కొడుతున్న ముస్లిం రౌడీ మూకను ఎదుర్కోవడానికి కిందకు దూకి పరిగెత్తించిన వారి సోదరుడు మహాదేవ శాస్త్రి ఎంత శారీరకంగా, మానసికంగా బలవంతుడో మననం చేసుకున్నాము. వారింట్లో ఉండేవారికి తలలు వంచి నమస్కరిచాము. వచ్చిన స్వయంసేవకులందరికీ మంచి షర్బత్ ఇచ్చారు. జీవిత్తమ్ లో ఆ రుచ మార్చి పోలేదు.
రాత్రిళ్ళు రేశముబాగ్ లో డాక్టర్జీ స్మారకం ఎదురుగా ఎన్ని సార్లు కూర్చున్నామో. ఆ దగ్గరలో పడుకునేవాళ్ళం. క్రింద ఒక దుప్పటి పరుచుకొని మరో దుప్పటి తల క్రింద పెట్టుకుని సుబ్రహ్మణ్యం గారు, నేను ప్రసాద రాజు ఒక దగ్గర పడుకుని ఆ రోజు విశేషాలు మాట్లాడుకునేవారం.
ఇక పడుకుందాము. ఉదయమే లేవాలి కదా అని వారు మమ్మల్ని పడుకోపెట్టి రెండు నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చునే వారు. తరువాత మళ్లీ మాస్ట్లాడా కుండా నిద్ర పోయేవారు. ఒక నాడు ఆడిగేసాను. మీరు అలా కూర్చుని ఏమి చేస్తారు? అని. అప్పుడు వారు నవ్వి ప్రతఙ్ఞ ఒక సారి మననం చేస్తాను. నీవు రోజూ చెప్పుకోవా? అది అవసరమోయ్, నీవూ చేయి అని చెప్పారు. నేను అలవాటు ప్రారంభించాను.

మరో వ్యాసం లో కలుద్దాము. మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. వారి చిన్నప్పటి జీవితం, సంఘటనలు ఎన్ని సార్లు చదివామో! శాఖల్లో చెప్పామో! ఇప్పుడు ప్రత్యక్ష అను భూతి. ఇల్లంతా కలయా తిరిగాము. బాల స్వయంసేవకులతో ఆ పరమపూజ్యుడు కథలు చెప్పుకున్న గది చూసాము దిండ్లతో కొట్టుకుంటూ పిల్లలతో ఆడిన డాక్టర్జీ ని ఊహించు కుని నవ్వుకున్నాం.

    ReplyDelete