Breaking News

మాననీయ సోమయాజులు గారు -యోజన తరువాతే పని

మాననీయ శ్రీ సోమయాజులు గారు నిరంతర పరిశ్రమ యోజనా బద్దంగా ఉండేది. భాగ్య నగర్ లో జరగాల్సిన అనేక పనులకి వారికి మనుషులు దొరికే వారు. అన్ని పనులను యోజనా బద్దంగా విజయవంతం చేయడం వారి నై జం. ఎన్ని రంగాలు వికసింప చేశారో.
పాలిటెక్నిక్ చదువుకొని ఉద్యోగం కోసం భాగ్యనగర్ చేరుకున్న వారు, మాననీయ సాఠేజి, మాననీయ సోమయ్యగారి మార్గదర్శనం లో ఉద్యోగం, సంసారం అన్నీ వదిలేసి భారత మాత సేవ rss మార్గం లో చేయ నిశ్చయిన్చుకున్నారు.
చాలా కాలం భాగ్యనగర్ లో ఉండటం వారికి నాలుగు తరాల స్వయంసేవకుల తో పనిచేశారు.

ఏ పనైనా ముందు యోజన లేకుండా చేయ కూడదని చెపుతుండే వారు. ఇది వారి పర్యటన, బౌద్ధిక్, కథ, శారీరక్, వంశీ వాదన, కార్యకర్తలను ఏ సమయాల్లో కలవాలి, ఎవరికి ఏ పని అప్పచెప్పి, ఎలా చేయాలో అన్నీ చాలా యోజనాబద్దం గా ఉండేది.
ఒకసారి మా నగర ఉత్సవం లో వారి బౌద్ధిక్ ఉండింది. నేనూ వారితో ఉన్నాను. రక్షా బంధన్ ఉత్సవం. వర్షం లో అనుకోకుండా స్థలం మార్చాము. ఒకరి ఇంట్లో ఉండే హాల్లో కార్యక్రమం, ప్రారంభం అయ్యింది. బౌద్ధిక్ అయ్యింది. రక్షలు కట్టుకోవడానికి ముందు శ్లోకం ఎవరు చెప్పాలో యోజన లో లేదు. నేను
చెబుతాను సోమయాజులు గారు అని వారి ప్రక్కనే ఉన్న నేను అడిగాను.
వారు కొంచం కోపం గానే కాగితం పై మంత్రం వ్రాయి అన్నారు

అందరికి రక్షలిస్తున్నారు. నేను పేపర్ పై శ్లోకం వ్రాసాను. వారు చూడలేదు. నవ్వుతూ ఇప్పుడు చెప్పు అన్నారు. నేను అప్పటికి 30 సంవత్సరాల స్వయంసేవక్ నాకు గుర్తుండక పోవడం ఉండదు. కాని నాచే ఒకసారి రాయించారు. అదే వారిని నేనదిగాను. చూడు మూర్తి! యోజన, పరిశ్రమ లేకుండా ప్రదర్శన చేయగూడదు. అది ఎంత చిన్న పనైనా? అన్నారు.
ఇది కూడా శిక్షణె. నాకు వారిపై గౌరవం ఇనుమడించింది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. మాననీయ సోమయాజులు గారు -యోజన తరువాతే పని

    ReplyDelete