Breaking News

గాంధీజీ హత్య తరువాత


మహాత్మా గాంధీ హత్య ఉదంతం దేశమంతా ఒక్క సారి భగ్గు మంది. పూజనీయ గురూజీ స్వయంసేవకు లందరికి ఒక సందేశం ఇచ్చారు. స్వతంత్రం వచ్చి సంవత్సరం కాలేదు. ప్రభుత్వం, కాంగ్రెస్, అదే అదనుగా కమ్యూనిస్టులు దాడులు చేస్తారు. కాని భౌతికంగా ఎదుర్కోవడానికి ఇది సమయం కాదు. పళ్ళు మనవే, నాలుక మనదే. నాలుక కొరకబడితె పళ్ళు రాల గొట్టుకోము. Be calm at all costs.
స్వతంత్రానికి ముందు దేశం చీల్చబడింది. మతం ఆధారంగా. దేశం లో ఇటువంటి దుర్దశ ఎప్పుడూ లేదు. కేవలం సంఖ్యా లెక్కవేయలేదు. హిందువుల పై అనేక చోట్ల దాడులు, హత్యలు,మానభంగాలు, గృహదహనాలు కూడా జరిగాయి. గాంధీ శాంతి వాక్కులు హిందువులు వీస్తూ పోయారు. ఈ విషయం లో అనేక చోట్ల హిందూ రక్షా కవచంగా సంఘం నిలబటం 
ప్రజలు గమనించారు. సంఘ శాఖలు పెట్టడానికి ఆహ్వానాలు వెల్లువెత్తాయి. సంఘం లో సరిగా శారీరక్ రాని వారుకూడా విస్తారకులిగా పంపబడ్డారు. అవకాశం లేని చోట్ల ఎప్పుడయినా శాఖా చూసినవాదు కూడా శాఖలు ప్రారంభం చేశారు. స్వతంత్రం వచ్చింది.

ఈ వాతావరణం నెహ్రు కి నచ్చలేదు. ఈ లోగా పటేల్ సంఘాన్ని కాంగ్రెస్ లో చేరమని కబురు పెట్టారు. రాజకీయన్గా స్వతంత్రం సాధ్యం అయ్యింది, స్వరాజ్యం వచ్చింది. కాని దేశ నిజమైన సామాజిక, జాతీయతా భావనలుండే స్వతంత్రం రాలేదు. అటువంటి విశాల లక్ష్యాలు సంఘానికి ఉన్నాయి. మేము మా పని చేసుకుంటాము అని సంఘం సవినయంగా తిరస్కరించింది. నెహ్రు కి ఇది మింగుడు పడని విషయం. దేశానికే ఆయనే సూపర్ పవర్, సంఘం వారికి ధిక్కారంగా తోచింది. ప్రభుత్వ శక్తి తప్ప మరే సామాజిక శక్తి ఉండకూడదన్న కమ్యూనిస్టు సిద్ధాంతం వారి అంతర్గతం లో ప్రవేశించింది.
ఈ సమయం లో గాడ్సే గాంధీజీ హత్య చేయడం తో దాన్ని సంఘం పై ఆరోపించి మూసి వేసిన సంగతి అందరికీ అర్థం అయ్యింది. కాని గాంధీజీ హత్యను దేశం తట్టుకోలేక పోయి సంఘాన్ని నెరస్థుడి లాగ చూడటం దుర్భరమయినది.
చర్చలు జరుగుతున్నాయి. కోర్టు లో కేసు ప్రారంభం అయ్యింది. పూజనీయ గురూజీ అరెస్టు, జైలుపాలు. నెలలు గడుస్తున్నాయి. గురూజీ శాఖలు ప్రారంభించాల్సిందిగా పిలుపు ఇచ్చారు. అదే సత్యాగ్రహం. శాఖ ప్రారంభం, వెంటనే పోలీసులు అరెస్ట్ జైళ్ల నిండటం.
ఏకంగా 60 వేల మంది నిర్బంధింప పడ్డారు. కోర్టు కేసుని కొట్టేసింది. గాంధీ హత్యకు, సంఘానికి సంబంధం లేదని చెప్పింది. బాన్ లిఫ్ట్ చేయక తప్పింది కాదు. కాని ప్రజల్లో అనుమానాలు పోలేదు. అందులో శాఖ ప్రారంభం చేస్తే పోలీస్ అరెస్ట్ చేసిన ఉదంతాలు ఇదివరలో చూసిన సమాజం తమ పిల్లలని సంఘానికి రానివ్వలేదు.

పూజనీయ గురూజీ దేశం అంతా తిరిగి ఈ భయానక వాతావరణం మార్చడానికి నడుం కట్టారు. మళ్ళీ సంఘ శాఖలు ప్రారంభం అయ్యాయి. నిజంగా అప్పుడు పని చేసిన వారి మనోస్త్థెర్యం , సంఘ పై సన్నగిల్లని మొక్కవోని విశ్వాసం తలుచు కుంటేనే మొకరిల్లలనిపిస్తుంది. ఆ వ్యతిరేక వాతావరణం సంఘం మార్చి వేసింది. సాత్విక శక్తికి ఇదొక ఉదాహరణ.
- నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. పూజనీయ గురూజీ దేశం అంతా తిరిగి ఈ భయానక వాతావరణం మార్చడానికి నడుం కట్టారు.

    ReplyDelete