Breaking News

శృంగవరపు కోటలో ఒక నాడు

నాకు ఈ మధ్యలో మధుమేహ వ్యాధి తో ఇబ్బందులు తెలుస్తు న్నాయి. మందు తీసుకునే వాళ్ళు కొన్ని నిర్దిష్ట వేళల్లో కడుపులో తిండి పడక పోతే వచ్చే కష్టం ఈ మధ్య తెలుస్తుంది.
1988 - 91 నేను విజయనగరం జిల్లా ప్రచారక్ గా ఉన్నాను. మాననీయ సోమయాజుల నాగేశ్వర్ రావు గారు విభాగ్ ప్రచారక్గా, మాననీయ శివ ప్రసాద్ గారు విభాగ్ కార్యవాహ్ గా ఉండేవారు. శివ ప్రసాద్ గారు ఆంధ్ర యూనివర్సిటీ లో సంస్కృత ఉపన్యాసకులు. విభాగ్ అంతా వారిద్దరు తిరిగే వారు. మాననీయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రాంత అధికారి గా వస్తుండే వారు.
మాననీయ శివ ప్రసాద్ గారు, ఎక్కువ రోజులు పర్యటన ఇచ్చేవారు. వారి నవ్వుతో కూడిన మోము, హాస్యం జోడించి చురకలు ఉత్సాహాన్ని ఇచ్చేవి. వారు విపరీతంగా పర్యటించేవారు. విభాగ్ అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇండేది. వారి చిన్న వయసు లో విశాఖ నుండి విజయనగరం సైకిల్ పై పర్యటన చేసే వారని విన్నప్పుడు(65 కి మీ +65 కి మీ) మాకు ఆశ్చర్యం వేసేది.
ఒకసారి వారు s. కోట పర్యటనకు వచ్చారు. శాఖా పూర్తి అయ్యే సరికి 7.30 అయ్యింది. సంఘస్థాన్ లో మరో అరగంట కబుర్లు. ఒక ఇంటికి గృహ సంపర్కం కి వెళ్ళాము. కొత్త పరిచయం కాస్త ఎక్కువ సేపే కూర్చున్నాము. శ్రీ సాయిప్రసాద్ గారింటికి వేళ్ళని మెల్లిగా 8.45 అయ్యింది. మరో ఇంటికి వెళదామా? అని అడిగాను. అక్కయ్య గారు,ఆగండి పాలు ఇప్పుడే వచ్చాయి. కాఫీ కలిపి ఇస్తాను అన్నారు. నా మాటతో లేచినవారు, అమ్మాయి కాఫీ ఇస్తానందయ్య అంటూ కూర్చున్నారు. నాకు అప్పుడు అర్థం అయ్యింది. వారు ముందే డయాబెటిక్ ఉదయం నుంచి ఏమీ పడలేదు. వెంటనే లోనికి వెళ్లి అక్కయ్యగారు కొంచం ఉప్మా కూడా చేస్తారా? అని అడిగాను. అయ్యో దోసె పిండి ఉందండీ. మీరు వెల్లాలి అంటుంటే, త్వరగా వెళ్ళలేమో అని అడగ లేదు. ఒక్క నిమిషం అని వేడి వేడి దోసెలు చేసి పెట్టారు. వారు వాటిని తీసుకొని నవ్వుతూ, మా మూర్తికి సంఘ పని తప్ప మిగతావి గుర్తుకు రావు లేమ్మా 
అంటూ తినేశారు. నాకు కొంచం బాధ గా అనిపించింది.

కాని నా పర్యటన లో ఇప్పుడు కొంచం ఆలస్య మయితే డయాబెటిక్ వారి పరిస్థితి అర్థం అవుతుంది. వారు ఎన్ని ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా అన్ని సెలవులు, అవసరం అయితే సెలవులు పెట్టి నిష్ఠ గా సంఘ పని చేయడం నాకు ఆశ్చర్యంగా ఉండేది. సంఘ పని పై శ్రద్ధ, నిరంతర పరిశ్రమ, మాకు ఈ పని ప్రాముఖ్యత తెలియ జేసేది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. శృంగవరపు కోటలో ఒక నాడు

    ReplyDelete