Breaking News

జాతీయ యువజన దినోత్సవం-National Youth Day-A Special Story on Swami Vivekananda





వివేకానంద... ఈ పేరు వింటే యువత పులకించిపోతుంది. వారికి ఆయన ఓ స్ఫూర్తి మంత్రం. ఇనుప కండరాలు.. ఉక్కు నరాలతో ఉత్తుంగ తరంగాలుగా చెలరేగిపోతారు. వివేకానందుడు ఓ వ్యక్తి కాదు... మహా శక్తి. తన మాటల మంత్రంతో ఎంతో మందిని ప్రభావితం చేశారు. తన వాగ్దాటితో అందరి హృదయాల్లో చెరగని స్థానం ముద్రించుకున్నారు. గురువు రామకృష్ణ పరమహంస నుంచి ఆర్జించిన జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేశారు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు వంటి పాశ్చాత్య దేశాల్లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేశారు. ఆధునిక ప్రపంచంలో మొట్ట మొదటి మేనేజ్‌మెంట్ గురూ.. స్వామి వివేకానంద అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన జన్మదిమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. వివేకానందుడు ప్రవచించిన సూక్తులు.. ఇప్పటికీ నిత్యనూతనమే. ఎన్నో ఒత్తిళ్ల మధ్య బతుకుతూ చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేటి యువతరం వివేకానందుని గురించి తెలుసుకున్నా..ఆయన సూక్తులు ఆచరించినా చాలు ఎనలేని ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తుంది.

1 comment:

  1. జాతీయ యువజన దినోత్సవం-National Youth Day-A Special Story on Swami Vivekananda

    ReplyDelete