Breaking News

దయ చేసి ఈ డొక్కా సీతమ్మను మదర్ థెరెసా తో పోల్చకూడదు




ఈమే భారతీయులందరికి ఒక హీరొయిన్ వంటిది.అందరికి ఆదర్శం.మహిళల్లో ఉత్తమ మహిళామణి.

సీతమ్మ పుట్టింది భారత దేశం లోనే. అన్నం పెట్టిన వారి కులం, మతం అడుగలేదు.మతాలు మార్చలేదు.విదేశాలనుండి డబ్బులు విరాళాలుగా సేకరించలేదు.అన్నం పెడుతూ పెడుతూ తన దేవున్నే ప్రార్థించాలని పట్టు పట్టలేదు.తన ఫోటోలు, తాను చేసే పనులు ప్రచారం జరగాలని, దానివల్ల వచ్చే నిధులు అందుకోవాలని ఆశించలేదు. ఈమె పేరు చెప్పుకుని, దేశమంతా మత ప్రచారం చేసే బృందాన్ని ఈమె ప్రోత్సహించలేదు.తన అన్నదానం గుప్త దానంగా,భగవంతుడికి సమర్పించే నైవేద్యంగా వుండాలని భక్తి, శ్రద్ధలు తప్ప హంగులు ఆర్భాటాలు, ప్రభుత్వ పరమైన సహకారాలు లేకుండా నిస్వార్థంగా సేవ చేసిన ఈ కరుణామయి కి భారతీయులు ఎంతగానో ఋణపడి వున్నారు.కొన్ని టి వి లు, కొన్ని ప్రసార మాధ్యమాలు,కొందరు విదేశీ సంస్థలు పనిగట్టుకుని ఈమె గురించి ప్రచారం చేసి వుంటే, అందరికీ తెలిసి వుండేది.కాని సీతమ్మ అటువంటిది కాదు.సీతమ్మ అంటే నిజంగా సీతమ్మనే...ఆమె పిల్లలం, వారసులం మనమంతా. ..

ఈ డొక్కా సీతమ్మ ను మించిన సేవా మూర్తి ఇంకెవరుంటారు.? తలుపులు తడితే చాలు,కాదనకుండా అన్నం పెట్టి సేద తీర్చే అన్నపూర్ణ. లక్షలాది మందికి స్వంత ఖర్చులతో అన్నదానం చేసి చరిత్ర సృష్టించింది.1841 లో పుట్టి, 1909 వరకు జీవించి, జీవించినంత కాలం అన్నార్తులకు అన్నం పెట్టడమే లక్ష్యంగా జీవించింది.రాజులు , జమీందారులు కూడా మారు వేషాల్లో వచ్చి ఈమె చెతి వంట రుచి చూసి వెళ్ళారు. దారిలో పోయే వారైతే లెక్ఖ లేదు .లక్షల మంది ఈమె వూరు లంక గన్నవరం (గోదావరి ఒడ్డున వున్నది) విచ్చేసి, ఆకలి తీర్చుకునేవారు.

ఒకసారి ఈమె గారు అంతర్వేది నర్సింహస్వామి ని దర్శించడానికి వెల్తుంటే, వంతెన వద్ద తన పల్లకి ని ఆపి సేద తీర్చుకుంటున్న సమయం లో ఎదురుగ వస్తున్న ఒక పెళ్ళి బృందం వారిలో చిన్న పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుంటే,వారిని ఓదారుస్తూ వారి తల్లి దండ్రులు ' డొక్కా సీతమ్మ ' గారు వుండే వూరికి వెల్తే చాలు..ఆకలి తీరుతుందని అంటున్న మాటలు విన్న డొక్కా సీతమ్మ వెంటనే పల్లకిని వెనక్కి తిప్పుకుని ఈ పెళ్ళి బృందం వచ్చేటప్పటికి వూరు చేరి వంట చేయటం మొదలు పెట్టింది.వూరూరా ఆమె పేరు చెప్పుకుని జీవించారు.

బ్రిటిష్ చక్రవర్తి కింగ్ ఎడ్వర్డ్ 7 తన సామ్రాజ్య పట్టాభిషేకపు సంబరాలు జరుపుకునే ముందు తన కుర్చి పక్కన సీతమ్మ గారి ఫోటో పెట్టి, దానికి మొక్కిగాని పట్టాభిషేకం చేసుకోనని అన్నాడు.వెంటనే అప్పటి తూర్పు గోదావరిజిల్లా కలెక్టర్ కి ఉత్తరం వ్రాసి ఫోటో తెప్పించమని ఆదేశించాడు.మద్రాస్ ముఖ్య కార్యదర్శి ని పంపి ఆమెను డిల్లీకి తీసుకుని రమ్మన్నాడు..కాని ఆమె ఒప్పుకోలేదు.ఇది తన ప్రాథమిక కర్తవ్యమని చెప్పి తిప్పి పంపింది.

ఆ కలెక్టరు గారు సీతమ్మ వద్దకు వచ్చి,ఫొటో తీసుకుంటానంటే ఆమె ఒప్పుకోలేదు.తన పదవి వూడిపోతుందని వేడుకుని, బలవంతంగా ఒక ఫోటో తీసి, లండన్ పంపించాడు. తన స్వంత ఖర్చుతో అందరికీ అన్నదానం చేసి,చేసి, చివరకు తమకు వున్న 1000 ఎకరాల భూమిని అమ్మి అన్న దానం చేస్తూ వచ్చింది. ఆఖరికి తమ కుటుంబానికి తిన లేని పరిస్థితి వచ్చింది.అప్పటికి ఆకలి తీర్చుకునే వారి సంఖ్య తగ్గలేదు.భర్త జొగయ్య గారు సీతమ్మతొ ' మనకే ఇబ్బంది గా వుంది అందరికెలా అన్నం పెడతావూ అంటూ ప్రశ్నిస్తే సీతమ్మ అంటుందీ తాను అన్నం పెడుతున్నది స్వయంగా భగవానుడు విష్ణు మూర్తికే కదా ...ఆయనే చూసుకుంటాడని జవాబిస్తుంది.అదే రోజు సాయంత్రం తమ పెరట్లో తవ్వుతుంటే భూమిలో బంగారు లంక బిందె దొరికింది.ఇంకేముంది...మల్లీ అన్నదానం యధావిధిగా నిరాటంకంగా కొనసాగింది.ఇప్పటికీ కొనసాగుతునే వుంది.
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. దయ చేసి ఈ డొక్కా సీతమ్మను మదర్ థెరెసా తో పోల్చకూడదు

    ReplyDelete
  2. భరత మాత కి జై మీ వంటి సత్యాణ్వేషులకు సత్క దాతలకు ఋణ పడి ఉన్నాము

    ReplyDelete