Breaking News

గాంధి పుట్టిన దేశమా ఇది




పల్లవి :
గాంధి పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
॥గాంధి॥
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా
గాంధి పుట్టిన దేశమా...

చరణం : 1
సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం (2)
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు
యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు
॥గాంధి॥

చరణం : 2
సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ (2)
శాంతి సహనం సమధర్మం పై విరిగెను గూండా లాఠీ
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
హెచ్చెను హింసాద్వేషం ఏమవుతుందీ దేశం
॥గాంధి॥

చరణం : 3
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లెసైన్స్
అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం ॥గాంధి॥

1 comment:

  1. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం (2)
    ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు
    యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
    ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు

    ReplyDelete