Breaking News

అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని




*అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని...*_
*తప్పు...*
ధర్మం దానంతట అదే గెలవదు,,
నువ్వు గెలిపించాలి,
మనం కలిసి గెలిపించాలి..
అర్థం కాలేదా...?
అయితే రా.. ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడూ..
'త్రేతాయుగంలో'
రాముడి భార్యను రావణుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని 
గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు... రావణుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు,, ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి తన భుజాలను, తొడ బాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, 
యద్ధంలో గెలిచాడు... 
ధర్మం గెలిచింది..!
'ద్వాపరయగంలో' 
కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని సాధారణ ప్రేక్షకుడిలా యుద్దాన్ని చూడలేదు..
ధర్మం చూసుకున్నాడు పాండవుల పక్షాన నిలుచున్నాడు 
అర్జునుడికి 
రధ సారధిగా మారాడు, 
గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, 
దాని పేడ ఎత్తేసాడు, 
స్నానాలు చేయించాడు,, 
ఆ యుద్ధంలో రధాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రధాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు... 
అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు...
అబద్ధం ఆడాడు,
చివరకు మోసం కూడా చేసాడు... 
అవన్ని ధర్మం కోసమే చేసాడు, 
ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు.
అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, 
ధర్మం గెలిచింది...! 
'కలియుగం'
ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం..
ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది..
నువ్వు నమ్మితే అది
నిజం మాత్రమే అవుతుంది..
అదే నువ్వు నా, నీ, తన, మన, బేదాలను పక్కన పెట్టి న్యాయం అలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది.. 
అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, 
తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనక ఈ ప్రపంచమే నడుస్తుంది. . !
- శ్రీను.

2 comments:

  1. అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని

    ReplyDelete
  2. True.good message.thanks for enlightening.let us spead the message so that people fighting for dharma increase and plunge into action

    ReplyDelete