Breaking News

అమ్మను మించి దైవమున్నదా-Ammanu Minchi Daivamunada




పల్లవి :
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే ॥

చరణం : 1

రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీతలాగ తాను
కోటి ఉగాదులేనా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే

చరణం : 2

తప్పడడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రీ అని
గుండె కద్దుకున్నావు
తప్పడడుగులేస్తే ఈనాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే (2)
ఐనా నీ ముంగిట
అదే అదే పసివాడినే ॥

1 comment:

  1. అమ్మను మించి దైవమున్నదా-Ammanu Minchi Daivamunada

    ReplyDelete