Breaking News

డా అంబేద్కర్ సంక్షిప్త జీవిత చరిత్ర ఇది (2 వ భాగం)-Dr BR Ambedkar Biography in telugu

అందరూ చదవాలి..భారతీయులంతా స్వేచ్చ,సమత,బంధుభావంతో మెలగాలి..

* నిమ్న వర్గాల కోసం ఉద్యమించిన డా అంబేద్కర్ ఎన్నడూ కూడా కమ్యూనిష్టుల వలలొ చిక్కుకోలేదు.తిను,త్రాగు,ఎంజాయ్ చేయ్ అనే పద్దతిలో ప్రజలు కేవలం ఆర్థిక ప్రాణులు కాదని తేల్చి చెప్పాడు.ధర్మం ఆధారంగా మనుష్యులు ఒక ఆదర్శ జీవనాన్ని కొనసాగించాలని కోరుకున్నారు..నైతిక జీవనం మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందని చెప్పారు..

* అందుకే బుద్ధుడు చెప్పిన 'ఆత్మ దీపో భవ ' అను సూక్తి డా అంబేద్కర్ ఒక దీపస్తంభం వలే భావించాడు.నిమ్న వర్గాల ప్రజలు శాంతి,దయ, ప్రేమ ల తో జీవించాలంటే మతానికి ప్రాధాన్యత నివ్వాలని అభిప్రాయపడ్డారు.అది మాత్రమే సమాజం లోని చెడుని దూరం చేస్తుందని విశ్వసించాడు.

*1935 లో భార్య రమాబాయ్ చనిపోయింది.అంతకుముందే ఇద్దరు సంతానం చనిపోయారు.సమాజ కార్యం లో ఆయనకు ఏడ్వడానికి సమయం లేదు.అదే సంవత్సరం ప్రిన్సిపాల్ గా పని చేసి,అది వదలి పెట్టి పూర్తి జీవితం సమాజానికి అంకితం చేశాడు.

* తన చివరి జీవితకాలంలో డా.సవిత ను వివాహం చేసుకున్నాడు..ఆమె సహధర్మచారిణిగా అంబేద్కర్ కి శ్రద్ధతో సపర్యలు చేసింది.

*నిమ్న వర్గాల ప్రజలు , సవర్ణుల ద్వారా ఎదుర్కొంటున్న అన్యాయం చూసి రగిలిపోయాడు..మనుస్మృతి ని తగలపెట్టారు.రామ క్రిష్ణులను నిందించారు.నా ప్రజలకు నేను వ్రాసిన రాజ్యాంగం కూడా ఉపయోగపడక పోతే దీన్ని కూడా తగలపెడతాను అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ చర్యలన్నీ కేవలం తన ప్రజలకు న్యాయం జరగాలనే తపన లో నుండి వచ్చినవే తప్ప, ఈ దేశం పట్ల, ధర్మం పట్ల శ్రద్ధ లేక కాదు.

*సంస్కృతం నేర్చి, పురాణ ఇతిహాసాల్లో అంటరానితనం ఎక్కడా లేదని,ఇది కేవలం 2000 సంవత్సరాల క్రితం మొదలైన దురాచారమని పేర్కొన్నాడు..ఆర్యులు బయటినుండి వచ్చారని చెప్పటం తప్పని, ఆర్య అనే పదం ఒక వర్గానికి చెందిన పదం కాదని,అది మంచితనం, గుణ వాచకమని నిరూపించాడు.తన గురువైన ఫూలే అభిప్రాయాన్ని కూడా ఖండించి,తన అధ్యయనం ద్వారే ఇది నిర్ద్వందంగా చెప్తున్నానని ప్రకటించాడు.

*అంతే కాదు, పాశ్చాత్య దేశాల్లో జాతీయత..సంస్కృతి భావన వికసించకముందే మన దేశం లో భిన్నత్వంలో ఏకత్వం వంటి ఉన్నత సంస్కృతి వ్యాప్తిచెందిందని వారు గర్వంగా చెప్పారు.

*13 అక్టోబర్,1935 లో అప్పటి హిందూ సమాజ పెద్దలకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ, తాను హిందు మతం లో చావనని అన్నాడు.

*చర్చ్ అధిపతి క్రైస్తవంలో , నిజాం నవాబ్ ఇస్లం చేరలని ప్రలోభ పరిచారు.

* అయినా హిందూ సంస్కృతిలో భాగమైన నిమ్న వర్గాలకు శాంతి,దయ,ప్రేమలు అందించే బౌద్ధాన్ని 1956 అక్టోబర్ 14 న లక్షలాది మంది తో చేరి అప్పుడు తుఫానులాగా వీస్తున్న కమ్యూనిజపు సిద్ధాంతం నుండి తన సోదరులను రక్షించిన ఘనుడు డా అంబేద్కర్..

*1940 లొ థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ పుస్తకం వ్రాశాడు.

*1942 లొ బ్రిటిష్ వైస్రాయ్ లో కార్మిక విభాగ మంత్రిగా చేరాడు. అదే సంవత్సరం ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ సంస్థ ను ప్రారంభించారు.

*1947 లో నెహ్రూ మంత్రి వర్గం లో న్యాయ శాఖా మంత్రి అయ్యారు.

* 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగ రచన గావించారు.అది భీమస్మృతి గా పిలుస్తారు కొందరు.

*స్వేచ్చ,సమత,బంధుత్వం ఈ మూడు తాను ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకోలేదని, బౌద్ధం నుండి గ్రహించానని చెప్పి, ఆ మూడు ఒకదానికొకటి పూరకంగా వున్నప్పుడే సామాజిక న్యాయం వెల్లివిరుస్తుందని ప్రకటించారు.

*1954 లో భండారా ఉప ఎన్నికలో తన అనుయాయులు తన గెలుపు కొసం రెండవ వోటు ను వృధా చెస్తామని అన్నప్పుడు,తాను అందించిన రాజ్యాంగ స్పూర్థికి అది విరుద్ధమని చెప్పి, తాను ఓడిపోయాడే కాని, ఆదర్శం వదలిపెట్టలేదు.

* 1952 లో ఒక కా ర్యక్రమం కొసం డబ్బులు చందా రూపకంగా సేకరించారు.రశీద్ పుస్తకాలు తిరిగి రాలేదు..అప్పుడు ఆయన ఒక్కొక్క పైసకు లెక్క రశీద్ వుండాలని, పైస లెక్క చూపించకపోవటం మహాపాపమని తన అనుయాయులకు నీతి బొధించారు.

* న్యాయశాఖా మంత్రిగా వున్నప్పుడు తన పుత్రుడు ఇద్దరు ఉద్యోగుల కోసం సిఫారస్ చేయడానికి వచ్చినప్పుడు,తిరస్కరించి, క్యాబిన్ నుంది బయట కు వెళ్ళగొట్టాడు.

* నెహ్రు మంత్రి వర్గం నుండి, హిందూ కోడ్ బిల్లు విషయం లో వచ్చిన విబేధాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసి, తనకు ఆదర్శమే ముఖ్యమని ప్రకటించిన మహనీయుడు. * ఎస్ సి వర్గాల అభ్యున్నతికి కేవలం ఒక కులాన్నే సంఘటిత పరచటం సరియైనది కాదని, అన్ని వర్గాల ప్రజలను సమీకరించే పని చేయాలని పేర్కొన్నారు.

* డా అంబేద్కర్ చూడాటానికి కఠొరంగా కంపించినా, వారి మనసు వెన్న వంటొ కోమలమైనది.వారి హృదయం దయ తో పరిపూర్ణమైనది..వారి జీవితం ఆదర్శమైనది.నిమ్న వర్గాల పట్ల సవర్ణుల అభిప్రాయాన్ని సానుకూలత గా మలచటానికి అత్యంత సహనం తో ఉద్యమించారు. సమాజాన్ని కులాల వారిగా విభజించే ద్వేషం తో కూడిన రాక్షస క్రొధం కాదు ....తప్పు లు సవరించే అమ్మ చూపే కోపాన్ని కలిగి సమాజాన్ని కలిపివుంచిన విశాల హృదయ సంపన్నుడు.

*డిసెంబర్ 6 , 1956 లో వారు ఆత్మ అనంత లోకాల్లొకి వెల్లింది..మన భారతీయులందరికి ఒక అనుసరణీయుడిగా,మన మనసుల్లో ఇప్పటికీ వెలుగొందుతూనే వున్నాడు..వారి బాటలో సమాజం లో సమరసత నిర్మాణానికి ముందుకు కదలుదాం. 
సామాజిక సమరసతా వేదిక.
- అప్పాల ప్రసాద్.

5 comments:

  1. నిమ్న వర్గాల కోసం ఉద్యమించిన డా అంబేద్కర్ ఎన్నడూ కూడా కమ్యూనిష్టుల వలలొ చిక్కుకోలేదు.తిను,త్రాగు,ఎంజాయ్ చేయ్ అనే పద్దతిలో ప్రజలు కేవలం ఆర్థిక ప్రాణులు కాదని తేల్చి చెప్పాడు.ధర్మం ఆధారంగా మనుష్యులు ఒక ఆదర్శ జీవనాన్ని కొనసాగించాలని కోరుకున్నారు..నైతిక జీవనం మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందని చెప్పారు.

    ReplyDelete
  2. జై అంబేద్కరిజం

    ReplyDelete
  3. Kammunistulu kuda adrshamga, nitika jeevanam,kanasagincharu kada enduku vari valalo chikkaledu

    ReplyDelete
  4. Jai bheem india lo andaru god ni kadu Ambedkar gari ni poojinchali

    ReplyDelete