Breaking News

నేటి మన మహిళ దుస్థితికి మనమే కారణం-Swami Vivekananda about INDIAN Women


మన సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం, గౌరవం గురించి పదేపదే చర్చించుకుంటున్న సమయం ఇది. ఎనాటి నుంచో స్త్రీని దేవతగా పూజించాలని మన సంప్రదాయాలు చెబుతున్నా అది ఏనాడూ కార్యరూపం దాల్చలేదు. మహిళ ఇప్పుడు తనని మనిషిగా గుర్తిస్తే చాలని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. ఈ సందర్భంగా భారతీయతని ఖండాంతరాలు దాటించిన వివేకానందుడు మహిళ గురించి ఏమంటున్నారో చూద్దామా-

నేటి భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్య లేకపోవటం. ఎలాంటి సమస్యనైనా విద్య మాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళా విద్యకోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవటం విచారకరం. వేదకాలంలోనే మహిళలు విద్యని అభ్యసించారు. గార్గి, మైత్రేయి, వంటి మహిళామణులు రుషి పీఠాలను అలంకరించారు.- అం టూ చికాగో సభలో వివేకానందుడు చెప్పారు. తన దేశం తిరిగి అలాంటి స్థితికి రావాలని, చరిత్ర పునరావృతమవుతుందనే ఆకాంక్షని వ్యక్తం చేశారు.

-స్వామి వివేకానంద ఎక్కడకు వెళ్ళినా, స్త్రీల గురించి ఎవరు ఏం ప్రశ్నించినా ఆనందంగా సమాధానం చెప్పేవారు. భారతీయ మహిళలు ఆదర్శమహిళలు. వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవలసి ఉంది. అనేవారు.

-''భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే! నిస్వార్ధత , త్యాగశీలత, సహనము ఈగుణాలతో విలసిల్లే స్త్రీ మూర్తియే మాతృమూర్తి'' అంటారు వివేకానంద. ఆయన స్త్రీ పురుష భేదాన్ని విస్మరించాలని బోధించారు. మానవ జాతి అంతా ఒక్కటే అని, అసమానతలు పెంచిపోషించడం కూడదని చెప్పారు.

-స్వామి వివేకానంద ఈ యుగంలో స్త్రీ పురుషుల సమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు. సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బండికి ఉన్న రెండు చక్రాల వంటివారని, సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలనీ, ఒక రెక్కతో ఎగరలేదనీ చెప్పారు.

-సోదరి నివేదితకు మార్గదర్శనం చేస్తూ- జీవితంలో ఎప్పుడూ ప్రజలగురించి, స్త్రీలగురించి అలక్ష్యం చయవద్దని, ప్రతి స్త్రీ జగన్మాత అంశమని, ఆమెను మాతృభావం తో గౌరవించాలని చెప్పారు. ఆమె అతిథులను గౌరవించే అన్నపూర్ణ అని, ఒక వ్యక్తిని అందరూ నిరాదరించినా, తల్లి ఎప్పుడూ తన సంతానాన్ని నిరాదరణకు గురిచేయదని స్వామీజీ అన్నారు. ప్రతిపురుషుడు ఆమెలోని మాతృశక్తిని గుర్తించి, తల్లిగా భావించి పూజించాలని'' స్వామి ఉద్భోదించారు.

-భారతదేశ పతనానికి స్వామీజీ రెండు కారణాలు చెప్పారు. ఒకటి మహిళలను అణచివేయటం, రెండవది కులం పేరుతో పేదవారిని పీడించడం. పాశ్చాత్య దేశాల్లో మహిళలు సమానంగా గౌరవం పొందుతున్నారన్నారు. కానీ మన దశంలో స్త్రీలు దాస్యంలో మగ్గుతున్నారని ఆవేదన చెందారు. మహిళలు ముందడుగు వేయకుండా దేశం పురోగతి సాధించలేదని చెప్పారు.

-పురుషులను సంబోధిస్తూ- మహిళల దుస్థితిని గమనించమని, దానికి కారణం మనమేనని అన్నారు.

వారిని విద్యావంతులను చేసి- తరువాత ఏం చేయాలనే నిర్ణయాన్ని మాత్రం మహిళలకే వదిలేయమని స్వామీజీ చెప్పారు. వారికేది మంచిదని అనిపిస్తే ఆ మార్గాన్ని వారే ఎంచు కుంటారని ఆయన తెలిపారు. -మహిళలు సైతం సమస్యలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవటం, పోరాట పటిమ సంతరించు కోవాలన్నారు. ఆత్మ రక్షణ అత్యంత అవసరం. తన జీవనోపాధిని తానే సమకూర్చుకోవాలి.

-మహిళలు జీవన ధర్మాలతో పాటు సమాజానికి ఉపయోగకరమైన అన్ని శాస్త్ర విద్యలు నేర్చుకోవాలి. పాశ్చాత్య దేశాల వివేకాన్ని పొందాలి. అదే సమయంలో మన నైతిక విలువలను వదిలిపెట్టకూడదన్నారు. -ఇతర దేశాలనుండి మనం నేర్చుకోవలసిన దానికన్నా మన మహిళలు ఇతరదేశాలకు ఎన్నో రెట్లు ఎక్కువ నేర్పించగలరని స్వామీజీ చెప్పారు.

-తన ధైర్య వచనాలు పురుషులకే కాక మహిళలకూ అన్నీ వర్తిస్తాయన్నారు.

-500 మంది పురుషులతో భారతదేశం విజయం సాధించడానికి యాభై సంవత్సరాలు పడితే అంతేమంది మహిళలతో అంతకంటే తక్కువ కాలంలోనే అది సాధ్యమవుతుందని వివేకానందుడు ఉద్ఘాటించారు. భారతీయ మహిళలపై స్వామికున్న నమ్మకం అది.

2 comments:

  1. నేటి మన మహిళ దుస్థితికి మనమే కారణం-Swami Vivekananda about INDIAN Women

    ReplyDelete
  2. nicely presented sir

    ReplyDelete