Breaking News

అమర వీరుల దినం-Martyrs Day


అమర వీరుల దినం (జనవరి 30): 
జాతి పిత మహాత్మగాంధీ హత్య జరిగిన ఈరోజును భారత్‌లో అమరవీరుల దినోత్సవంగా జరుపు కుంటారు. జనవరి 30, 1948వ సంవత్సరం లో మహాత్మగాంధీ నివాసం ఉంటున్న ఢిల్లీలో ని బిర్లా భవనం ప్రాంగణంలో గాంధీజీ ప్రార్థ నా సమావేశం వేదికను సమీపిస్తుండగా నాథూరాం గాడ్సే అనే వ్యక్తి రివాల్వర్‌తో గాంధీజీని కాల్చి చంపాడు. ఆనాటి నుండి గాంధీ వర్థంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున భారత దేశమంతటా 11 గంటలకి సైరన్‌ మోగు తుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి ‘శ్రద్ధాంజలి’ ఘటిస్తారు.

10 comments: