Breaking News

దేవేంద్రనాథ్ ఠాగూర్ (Devendranath Tagore)

జననం: మే 15 1817
మరణం: జనవరి 19 1905

దేవేంద్రనాధ్ టాగోర్, హిందూ తత్వవేత్త మరియు బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మత సంస్కరణానిక కృషిచేశరు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి.

కుటుంబ స్థితిగతులు
దేవేంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ నందు శ్రీలైదాహలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ వంశస్తులు తరతరాలుగా స్థితిమంతులే కాక ఉన్నత విద్యావంతులు, వారి రంగాల్లో నిపుణులూ కూడా అయివున్నారు. ఆ క్రమంలోనే దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్‌ను ప్రిన్స్‌ బిరుదుతో వ్యవహరించేవారు. ద్వారకానాథ్ ఠాగూర్ ఆనాటి వంగదేశంలో సంస్కర్తగా, మతకర్తగా ప్రఖ్యాతుడైన రాజా రామ్మోహనరాయ్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన సంస్కరణాభిలాషను, హిందూమత ఔన్నత్య చింతననూ ద్వారకానాథ్ అభినందించేవారు. రామమోహనరాయ్ ప్రారంభించిన బ్రహ్మ సమాజంపై సమాజంలోని నలువైపులా ఆరోపణలు, వ్యతిరేకత ప్రారంభమైన రోజుల్లో ద్వారకానాథ్ బ్రహ్మసమాజానికి, రామ్మోహనరాయ్‌కీ ప్రధాన సహాయకునిగా ఉండేవారు. ఠాగూరు కుటుంబపు జాగీరైన జాకో సంకోలోని ఒక భవనంలో బ్రహ్మసమాజపు మొదటి ప్రార్థనాలయాన్ని నిర్మించారు. దానికి ఆది బ్రాహ్మసమాజం అని పేరుపెట్టారు రామ్మోహనరాయ్. ఆపైన జొరా సంకోలో ఠాగూరు వంశస్థులందరూ బ్రహ్మసమాజీకులుగా మారారు. రామ్మోహనరాయ్ క్రైస్తవ మతప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మిషనరీ పాఠశాలలకు ప్రతిగా ప్రారంభించిన విద్యాలయాల్లో కూడా ఠాగూర్ వంశస్థులే తొలి విద్యార్థులుగా చేరారు.

1 comment:

  1. భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్.

    ReplyDelete