Breaking News

హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి?


డిశంబర్ 31 అర్థరాత్రి క్లబ్బుల్లోనూ,హోటల్స్ లోనూ,ఇళ్ళలోనూ,తోటల్లోనూ,రోడ్లమీదా...ఆడ,మగ తేడాలేకుండా గుంపులు..గుంపులుగా జనం చేరుతున్నారు.ఇందులో యువతీ యువకులు ఎక్కువగా వుంటున్నారు.వెస్టర్న్(పాశ్చాత్య)మ్యూసిక్ ల హోరులో,జోరులో,కేరింతలతో,చిందులేస్తూ అల్లరిచేస్తూ, కాలం గడుపుతారు.కొందరు పేకాట వంటి జూదాలు ఆడితే,మరి కొందరు మత్తుపదార్థాలు సేవిస్తారు.ఇలా వివిధ రకాలైన దురభ్యాసాలతో,అసభ్యరీతుల్లో ప్రవర్తిస్తుంటారు.రోడ్లపై పరుగులు,అరుపులూ,గోల,కేకలు... రాత్రి సమయమంతా టెలివిజన్ చానల్స్ విదేశీ సంగీత నృత్యాలతో రెచ్చిపోతున్నారు.షాంపైన్ బాటిల్స్ ఒపెన్ చేస్తూ ఆ నురగల్లో ఉబ్బితబ్బిబ్బైపోతారు.అర్థరాత్రి పిశచాల ఆనందం అంటే ఇదేనేమో? ఈ దురాచారం నగరాల నుండి గ్రామాలకు ప్రాకిపోయింది. అందరూ చేస్తున్నారు..మేము చేయకపోతే ఎలా అంటూ గొర్రెల మందలా అనుసరిస్తున్నారు.

హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి?

తాత్కాలికి ఎంజాయ్ మెంట్ ,దురలవాట్లు,మన స్వంత ఆచారాలను,సంప్రదాయాలను తెలుసుకోలేని అజ్ఞానం,విచ్చలవిడితనం,అనవసర ఖర్చులు..

గత పన్నెండు నెలలుగా చేసిన మంచి ఆలోచనలు,నోములు,వ్రతాలు,దేవాలయ దర్శనాలు ,మొక్కులు,మొక్కుబడులు,హిందూమతం,భారతీయ భావన ....బూడిదలో పోసిన పన్నీరులా, మనదంతా విదేశీయులకు ధారపోసి ఆ ఒక్క అర్ధరాత్రి డిశంబర్ 12 గంటలకు ఆ కొద్ది సేపు ఆంగ్లేయుల అలవాట్లకు సాష్టాంగ పడి,సరెండర్ అయి పోయి, బానిస బ్రతుకులుగా మారిపోవటం ఎంత బాధాకరమో,అవమానకరమో,ఎంత మూఢాచారమో,ఎంత అజ్ఞానమో,స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచినా,మనం మారేది ఎప్పుడో? అని మీకు మీరు అలోచించుకోవటం కోసమే ఇదంతా చెప్పేది! అంతే కాని బలవంతంగా చెప్పలేము కదా? ఈ స్వేచ్చాయుత దేశం లో ఆలోచించమని చెప్పగలము అలాగే గుడ్డిగా ఏదీ కూడా అనుసరించవద్దని విన్నపం చేయగలం.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి?

    ReplyDelete