భారత రత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

జననం: నవంబర్ 11, 1888
మరణం: ఫిభ్రవరి 22, 1958

మౌలానా అబుల్ కలాం ఆజాద్, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కా లో జన్మించాడు.

ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.

గౌరవాలు, బిరుదులు
గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ మరియు నెహ్రూ ఇతడిని మౌలానా , మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.

1992 లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.

ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.

సాహిత్యం
తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం)

"అల్-హిలాల్" మరియు "అల్-బలాగ్" అనే పత్రికలు స్థాపించాడు.

గుబార్-ఎ-ఖాతిర్

ఇండియా విన్స్ ఫ్రీడమ్.


సిమ్లా కాన్‌ఫరెన్స్ (1946) లో, మౌలానా, బాబూ రాజేంద్రప్రసాద్, జిన్నా మరియు రాజగోపాలాచారి

5 comments:

  1. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

    ReplyDelete
  2. Father of Indian education

    ReplyDelete