Breaking News

నిర్మలా దేశ్ పాండే

జననం :19 డిసెంబరు 1929-నాగపూర్, మహారాష్ట్ర.
మరణం: మే 1, 2008

ప్రముఖ గాంధేయవాది అయిన నిర్మలా దేశ్‌ పాండే, భారత దేశం లోని ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు. ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ మరాఠి రచయిత పి.వై. దేశ్‌పాండే. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలోనూ, భారత్-పాక్ శాంతి యాత్రలోనూ, టిబెట్ సమస్య పరిష్కారంలోనూ చురుగ్గా పాల్గొన్నది. జీవితాంతం గాంధేయ మార్గానికి కట్టుబడి అవివాహితురాలిగానే కొనసాగింది. సుమారు 60 సంవత్సరాలపాటు గాంధేయ భావాలతో కొనసాగి 2008, మే 1న ఢిల్లీలో 79వ యేట తుదిశ్వాస వదిలింది.


జీవనం


నిర్మలా దేశ్‌పాండే 1929, అక్టోబర్ 29న మహారాష్ట్ర లోని నాగ్పూర్‌లో విమల మరియు పి.వై.దేశ్‌పాండే జన్మించింది. తండ్రి ప్రముఖ మరాఠీ రచయిత. విద్యాభ్యాసం స్థానికంగా నాగపూర్‌లోనే కొనసాగింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచే ఎం.ఏ. పట్టా పొందినది. 1997 ఆగష్టులో తొలిసారిగా రాజ్యసభకు నియమితురాలయ్యింది. మళ్ళీ 2004 జూన్లో రెండవ సారి రాజ్యసభ సభ్యురాలిగా నియమించబడింది.



సామాజిక ఉద్యమంలో పాత్ర


1952లో వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా నిర్మలా దేశ్‌పాండే సామాజిక ఉద్యమంలో అడుగుపెట్టింది. వినోభాతో కలిసి 40,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ యాత్ర సమయంలో దాతలనుంచి అనేక వేల ఎకరాల భూములను సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టారు.



శాంతి యాత్రలు


కాశ్మీర్‌లో మరియు పంజాబ్ లో మతకలహాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నిర్మలా దేశ్‌పాండే ఆ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు శాంతి సందేశాలు అందించింది. 1996లో భారత్-పాకిస్తాన్ శాంతి సదస్సులో పాల్గొన్నది. టిబెట్టు సమస్య పరిష్కారానికి కూడా తన వంతు కృషిచేసిన మహనీయురాలు నిర్మలా దేశ్‌పాండే.



అవార్డులు


2006లో నిర్మలా దేశ్‌పాండేకు భారత ప్రభుత్వము పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు కూడా లభించింది.



మరణం


జీవితమంతా గాంధేయవాదిగా ఉంటూ, సామాజికవాదిగా సేవలని అందించిన నిర్మలా దేశ్‌పాండే 79వ యేట 2008, మే 1న ఢిల్లీలో తుదిశ్వాస వదిలింది.

1 comment:

  1. గాంధేయవాది నిర్మలా దేశ్ పాండే...

    ReplyDelete