Breaking News

కొర్లిపర బాలగంగాధర్ తిలక్

జననం : 1926, జనవరి 14 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు
మరణం : 2010, సెప్టెంబరు 23


కొర్లిపర బాలగంగాధర్ తిలక్ (1926 - 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు. తర్వాత ప్రజా నాట్యమండలిలో పనిచేశాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.

అభ్యుదయ భావాలతో సినిమాలు
ముద్దుబిడ్డ (1956)
ఎం.ఎల్.ఏ. (1957)
అత్తా ఒకింటి కోడలే (1958)
చిట్టి తమ్ముడు (1962)
ఉయ్యాల జంపాల (1965)
ఈడుజోడు (1967)
పంతాలు పట్టింపులు (1968)
కొల్లేటి కాపురం (1976)
ధర్మవడ్డీ (1982)
ఛోటీ బహు, కంగన్ (1971)

విశేషాలు
1974లో 'భూమి కోసం ' సినిమాను నక్సలైట్ ఉద్యమంలో మరణించిన తన సోదరుడు కొర్లిపర రామనరసింహారావు కు అంకితమిచ్చాడు.
జయప్రద ను వెండితెరకు పరిచయం చేశాడు.

అవార్డులు, గుర్తింపులు
2008 సంవత్సరపు బీఎన్. రెడ్డి అవార్డు లభించింది.

1 comment:

  1. స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత "కె.బి. తిలక్"

    ReplyDelete