Breaking News

కాలుష్య నివారణకు విద్యుత్తు పొదుపు

ప్రకృతి మనకు ప్రసాదించిన పంచ భూతాలు భూమి, నీరు, గాలి, వెలుగు, ఆకాశం,. స్వచ్చమైన జీవనానికి మూలమైన భూమి, నీరు, గాలి, వెలుగు, ఆకాశం... వీటిని నేడు మన అవసరాల కోసం ఏదో ఒక రూపంలో వినాశనం చేస్తుండటంతో మనం భూమిపై నివాసించలేని పరిస్థితి ఏర్పడుతోంది. వివిధ రకాల కాలుష్య కారకాలను వెదజల్లు తుండడంతో భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పరిశ్రుభ్రమైన గాలి కరువైంది. సునామి, కరవు, అధిక వానలు, వరదలు, వంటి ఉత్పాతాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో వుహించాలేకున్నాం. ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించే కార్యక్రమమే "ఎర్త్ అవర్".

వివిధ రకాల కాలుష్యాల వల్ల భూమి వేడేక్కుతుండటంతో ఏర్పడుతున్న ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకునే కార్యక్రమమే ఈ "ఎర్త్ అవర్". ఒక గంట పాటు విద్యుత్తు వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా భూమిపై వచ్చే వేడిని అరికట్టే ప్రయత్నాన్ని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ 2007 లో ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ప్రారంభించింది. ఒక గంట పాటు విద్యుత్తు దీపాలు ఆర్పివేయడం, ఫ్రిజ్ లు, ఏసిలు వంటి విద్యుత్తు వినియోగ వస్తువులను వాడకుండా నిరోధించడం చేస్తుంటారు. మార్చి చివరి శనివారం రోజున ఈ ఎర్త్ అవర్ ను నిర్వహిస్తారు.
- సాయినాథ్ రెడ్డి.

1 comment:

  1. కాలుష్య నివారణకు విద్యుత్తు పొదుపు.

    ReplyDelete