Breaking News

చైనా ఆర్థికంగా బలపడుతున్నందు వల్ల చైనాకు కలిగే అదనపు ప్రయోజనమేమిటి?


దానివల్ల చైనా మిలిటరీ బలపడుతున్నది..ప్రపంచ దేశాలపైన తన ప్రభావాన్ని చూపుతున్నది.కజకస్తాన్ దేశం తన 60శాతం భూమిని చైనాకు కట్టబెట్టింది.దాంతో చైనా, పైప్ లైన్ తన దేశానికి వేసికుని నూనె వనరులను దోచుకుంటున్నది.కజకస్తాన్ దేశ జనాభా మన ఢిల్లీ జనాభాను మించదు.ప్రపంచములో అత్యధికంగా యురేనియం ఉత్పత్తి చేసే దేశాల్లో అది ఒకటి.అర్జెంటినా దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లొ వుండి,ఐఎం ఎఫ్ నుండి అప్పు పుట్టనప్పుడు,చైనా అధ్యక్షుడు అర్జెంటినా దేశంలో పర్యటన చేసి,ఆ దేశానికి 20 బిలియన్ డాలర్లు ఋణమిచ్చాడు.వనరులున్న దేశాలన్నిటినీ తన వైపుకు తిప్పుకుంటున్నది.ప్రపంచం లో అమెరికాను మించిన అగ్రదేశంగా అది పావులు కదుపుతున్నది.తన స్థాయి ఎమిటో తనకు తెలుసు.అందుకే అభివృద్ధిలో పోటిలో వున్న మనను, ప్రపంచ దేశాలు వేటితోనూ లాభం పొంది, ఎదగకుండా చైనా అడ్డు తగులుతున్నది.ఆసియా అభివృద్ధి బ్యాంక్ అరుణాచల ప్రదేశ్ అభివృద్ధికోసం అప్పు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు,చైనా అడ్డు తగిలి,అరుణాచల ప్రదేశ్ తన దేశం లో భాగమని వివాదం లేవనెత్తింది.బ్యాంక్ అధికారులు మన జవాబు కోసం ఎదురుచూస్తున్నారు.మన దేశం మాట్లాడితే కదా? మన మౌనం తో అప్పు రద్దు అయిపోయింది.

- అప్పాల ప్రసాద్.

3 comments:

  1. చైనా ఆర్థికంగా బలపడుతున్నందు వల్ల చైనాకు కలిగే అదనపు ప్రయోజనమేమిటి?

    ReplyDelete
  2. మన ప్రభుత్వం కట్టినమైన నిర్ణయం తీసుకుంటేనే చైనా ఆటలకు అడ్డు వేయవచ్చు.

    ReplyDelete
  3. Eppatike arunachal Pradesh lo.. Kashmir kontha bhaghaanni akraminchindi china

    ReplyDelete