Breaking News

విద్యా వ్యవస్థలోని రిజర్వేషన్ పద్ధతి

మన ప్రజా వ్యవస్థలలో ...ముఖ్యంగా విద్యావ్యవస్థలో ఉన్న రిజర్వేషన్ పద్ధతిని,దాని అమలు తీరునూ, దాని ఫలాలను అందుకున్టున్నవారిని పరిశీలిస్తే నాకు వచ్చే ఆలోచన ... ఈ పధ్ధతి ఏ సదుద్దేశంతో ప్రవేశపెట్టబడిందో, ఆ పరమోద్దేశ్యా న్ని నెరవేర్చే దిశగా కనీసం లేశమాత్రమైనా పనికోస్తోందా ?? అని .
రాజ్యాంగ సభలో బాబా సాహెబ్ డా. బి.ఆర్ .అంబేడ్కర్ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్థావిస్తూ ..ఇది కేవలం 10 సంవత్సరాలు( అంటే 196౦ వరకు ) మాత్రమే కొనసాగాలని ఆకాంక్షించారు. అప్పటికి ఆ వర్గాలు సాధికారత సాధిoన్oచగలవనీ, సమాజంలో అన్ని రంగాలలో నిలదొక్కుకోగలవనీ ఆయన ఉద్దేశం కావచ్చు. కనీ రిజర్వేషన్ పద్ధతిని ప్రవేశపెట్టి 64 సంవత్సరాలుగడిచినా ఎన్నో లక్షల బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ...విద్యలో, ఉద్యోగాలలో ..అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్ ఫలాలకు ఆమడ దూరంలో ఎందుకు ఉండిపోయారు ?? ఈ ప్రశ్నను బహుశా ఆయా వర్గాల్లోని బలమైన శక్తులను ( సంపన్నులు, వ్యాపారులు, ప్రభుత్వోద్యోగులు, ఆర్ధిక, అంగ,రాజకీయ బలం ఉన్నవారిని ) అడిగితే సమాధానం దొరుకుతుందేమో...

స్వార్ధాన్ని వీడి... తన సామాజిక వర్గంలోనే బలహీనులుగా ఉన్నవారికి తోడ్పాటునందిస్తే...10 -15 సంవత్సరాలలో పేదరికం తగ్గడమే కాకుండా ..దేశంలో సామాజిక సమతౌల్యం, సమ్మిళిత వృద్ధి సాధించడం పెద్ద కష్టమేమి కాడనిపిస్తుంది....ఆలోచించండి మిత్రులారా ....

- డా|| కె. ఆశోక్ రెడ్డి,
విజయవాడ.

3 comments:

  1. విద్యా వ్యవస్థలోని రిజర్వేషన్ పద్ధతి.

    ReplyDelete
  2. రాజకీయ నాయకులు ఈ రిజర్వేషన్స్ ని వాళ్ళ స్వార్ధం కోసం, ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు.

    ReplyDelete
  3. andharu edhi telusukuni reservation vyavastalo marpulu teste baguntadi.

    ReplyDelete