Breaking News

స్వామి వివేకానంద-Swami Vivekananda



"జంతువులు మాత్రమే తమ ఉనికి కోసం కొట్లాడుకుంటాయి" - స్వామి వివేకానంద.

పరస్పర సహకారం వల్లనే ఐకమత్యం కలిగి వికాసానికి మార్గం ఏర్పడుతుంది' - పిత్రిమ్ సొరొకిన్ (రష్యన్ - అమెరికా సామాజికవేత్త 1889 - 1968)

"కులాల మధ్య పోరాటాల వల్ల ఉపయోగం లేదు.దాని వల్ల జరిగే మంచి ఏమిటి? అవి మనలను మరింత విడదీసి మరింతగా దిగజార్చుతాయి. కలహాలు గాని, వర్గ పోరాటం గాని సామాజిక వికాసాన్ని తెచ్చి పెట్టదు. సమాజంలో ఘర్షణలు లేవా? ఉన్నాయని నాకు తెలుసు. వాటిని పెంచుతూ పోతే సమాజం అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసించను.గొప్ప సంస్కర్తలమని విర్రవీగిన వారి వినాశకరమైన పథకాలు విఫలం అయ్యాయని గుర్తుకు తెచ్చుకోవాలి. " అని వివేకానంద అంటారు.
' మనిషి , సాటి మనిషితో పోరాటం చెయ్యకపోతే ప్రగతి చెందలేమని నేనూ గతంలో అనుకునేవాణ్ణి. ప్రతి యుద్దం మానవ ప్రగతిని యాభైఏళ్లు వెనక్కి నెట్టింది. వర్గ పోరాటాలు, శతృత్వం, విపరీతమైన ద్వేషం వల్ల అభివృద్ధి సాధ్యపడిందని ఒక్కగానొక్క ఉదాహరణ చూపించగలరా? పరస్పర సహకారం వల్లనే ఐకమత్యం కలిగి వికాసానికి మార్గం ఏర్పడుతుంది' అని పిత్రిమ్ సొరొకిన్ (రష్యన్ - అమెరికా సామాజికవేత్త 1889 - 1968) అభిప్రాయపడ్డారు. దీన్ని స్వామి వివేకానంద నూటికి నూరు శాతం అంగీకరించారు.
 - అప్పాల ప్రసాద్.

1 comment:

  1. "జంతువులు మాత్రమే తమ ఉనికి కోసం కొట్లాడుకుంటాయి" - స్వామి వివేకానంద.

    ReplyDelete