Breaking News

Sankranthi-సంక్రాంతి


సంక్రాంతి అంటే మార్పు కదా! ఏది నిజమైన క్రాంతి. కనబడుతున్న మార్పు ఏది? సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకృతి లో మార్పు వస్తుంది. సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించగానే ఉత్తరాయణం వచ్చి, సైన్స్‌ ప్రకారం వాతావరణం లో మార్పు జరిగే సమయం ఇది. నువ్వులు, బెల్లం, బియ్యం తో కూడిన వంటకాలు తింటే శరీరం లో ఆరోగ్యం తో కూడిన మార్పు. కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క,అన్న,చెల్లెలు , తమ్ముడు,తాత, నానమ్మ- కలిసి పండుగ జరుపుకున్న అందరిలో మానసిక ఆనందంతో కూడిన మార్పు. ధనిక,పేద,అన్ని కులాల వారు వారి వారి స్థాయి కి అనుగుణంగా సంతోషంతో ఆశించే మంచి మార్పు .

అలాగే సమాజంలో మార్పు తెచ్చి సంక్రాంతి తెచ్చిన సంఘటనలు తెలుసుకుందాం.
1. కరీంనగర్ జిల్లా లో చిన్న మెట్‌పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ తుమ్మల శ్రీ రామ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ భూమయ్య లు వూరిలో అన్ని కులాల వారికి అంత్యక్రియల కోసం ఒకే దగ్గర శ్మశానం ( 23 లక్షల రూపాయల వ్యయంతో) నిర్మాణం చేసారు. తక్కువ ఖర్చుతో దహన సంస్కారాలు జరిపే అవకాశం తో మంచి మార్పు
2. జగిత్యాల జిల్లాలో మెట్ల చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ రాజేందర్ రెడ్డి తరతమ భేదాలు లేకుండా వూరిలో దేవాలయ ప్రవేశం, సామూహిక భోజనం, భౌతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మార్పు కోసం మంచి ప్రయత్నం.
3. జగిత్యాల జిల్లా లో వెల్లుల్ల గ్రామంలో మాదిగ కులానికి చెందిన పూజారి గంగయ్య వుండటం- ప్రతి ఉగాది రోజున 5000 మందికి (అన్ని కులాల వారు దర్శనం చేసుకుంటారు) అన్నదానం తో మనసులలో మంచి మార్పు.
4.జగిత్యాల లో మాదిగ కులానికి చెందిన లక్ష్మీ నారాయణ పంచాంగం తో పాటు భగవద్గీత ఇంటింటా చెప్పటం వల్ల భక్తి తో కూడిన మార్పు. 
5. జగిత్యాల జిల్లాలో అంతర్గాం గ్రామంలో 4 గురు పెద్దమనుషులు కలిసి అన్ని కులాల వారికి ఒకే శ్మశానం ఏర్పాటు తో సామాజిక మార్పు లో ముందడుగు.

6 జగిత్యాల జిల్లాలో నేరెళ్ళ గ్రామంలో మాల కులానికి చెందిన ఇంద్రాల మల్లేశం ఇంట్లో పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు లను అలంకరణ చేస్తారు. ఇప్పటికీ 130 మంది కి(అన్ని కులాల వారికి) అలంకరణ చేశారు.ఇది అద్వితీయమైన మార్పు.
7.కోరుట్ల ప్రక్కన కట్లకుంట గ్రామంలో అహ్మద్, రాజేంద్ర ల నిర్వహణ లో ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన జాతీయ గీతం వినిపిస్తుంటే, ప్రజలు ఎక్కడికక్కడ నిలబడి పాడుతూ మార్పు దిశలో పయనం.
8.జగిత్యాల ప్రక్కన రాయికల్ గ్రామంలో శివలింగం మాల కుటుంబంలో జన్మించి, భక్తి భావనతో శివాలయం నిర్మాణం చేసి ఆ గుడిలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. ( మోహన్ రెడ్డి, లింగారెడ్డి ల ఆర్థిక సహకారం తో నిర్మాణం పూర్తయింది)ఆ గుడికి అన్ని కులాలకు చెందిన భక్తులు వస్తుండటం సామాజిక మార్పే కదా!
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సమాజంలో మార్పు తెచ్చి సంక్రాంతి తెచ్చిన సంఘటనలు తెలుసుకుందాం.

    ReplyDelete