Breaking News

ఈరంకి సుబ్రహ్మణ్యం గారు: సాధన

స్వర్గీయ సుబ్రహ్మణ్యం గారితో నా సంసారం ఏడు సంవత్సరాలు. నేను ఏలూరు లో ఉండగా మా జిల్లా ప్రచారకులు. నేను గుంటూరు ప్రచారక్ గా వెళ్ళేసరికి అక్కడ జిల్లా ప్రచారకులు. చాలా సీదాసాదా మనిషి. ఏలూరు లో మా రూంమెట్ ఆయన M.Sc. చదివారు అంటే నమ్మే వాడు కాదు. నేను ఏలూరు లో చాలా సినిమాలు చూసేవాడిని. ఒకసారి వారిని బలవంతాన గోపాలరావు గారి అమ్మాయి అనే సినిమా కు బలవంతా న తీసుకెళ్ళాను. తరువాత నా తప్పు అర్థం అయ్యింది. వారేదో అప్పుడు చురుకుగా సంఘపనిలో పాల్గొంటున్న నన్ను నిరాశపరచకూడదని మాత్రమే‌ వచ్చారు.తరువారు సినిమా లో కూర్చొని కూడా భీమవరం లో ఏమేమి చేయాలో రాసుకున్నారు.

గుంటూరు లో కార్యాలయం లో కలిసే ఉండేవాళ్ళం. వారిని దగ్గరగా చూసిన ఆనందం అలా మిగిలి‌పోయింది. రోజూ శాఖలో గంట సేపు ఉండటం, ప్రార్థన నియమం పాటించడం సహజమే అయినా అన్ని కార్య క్రమాల్లో పాల్గొనడమే కాకుండా, అక్కడ విధించే నియమాలని శ్రద్దగా పాటించే వారు. చిన్న చిరు కోపం ఉండేది కాని అది క్షణకాలమే. గురూజి నేను శీఘ్రకోపినే కాని దీర్ఘ ద్వేషిని కాను అని చెప్పెది నేను వారిలో చూసేవాడిని.

రోజు రాత్రి పడుకునేముందు మరుసటి రోజు పర్యటనలో తానేమి చేయాలో ఆలోచించి వ్రాసుకునేవారు.

ఆకాగితం వారి చొక్కా జేబులో దాచుకునేవారు. రాత్రి‌పడుకునే ముందు కూర్చుని ప్రతిజ్ఞ చెప్పు కునేవారు. రోజూ శాఖలో ప్రార్థన సరెసరి. పడుకునే ముందు కొద్దిసేపు పుస్తకపఠనం చేసేవారు. శారీరక శిక్షాక్రమ వారికి కంఠస్తం ఉండేది. అందుకే శిక్షావర్గ లో ఎవరికి అనుమానం వచ్చినా వారు రెఫరెన్సు బుక్. ఏ పాటయినా కంఠస్తం చెప్పేవారు. కథ, బౌద్దిక్,చర్చ, వార్తా సమీక్ష, అన్నీ ఒక్క ఈజీ పదం లేకుండా, వాటి పరిధుల్లోనుండి బయటకు పోకుండా, శ్రద్ద తక్కువ చేయకుండా, సాధన చేసి ప్రయోగించిన బాణం లా ఉండేది.


సంఘం ఎలా ఉండాలని చర్చించి నిర్ణయిస్తుందో దానిని వారు తను సాధన చేస్తున్నట్లుగా ఉండేది వారి జీవన గమనం. ప్రతీ ఉగాది నెల రోజుల ముందు నుండి డాక్టర్జీ పెద్ద పుస్తకం చదవడం ప్రారంభం చేసి ఉగాదికి పూర్తి చేసేవారు. ప్రార్థన, అర్థం కూడా ఉగాది నాడు వ్రాసి, కార్డు తో సరిచేసుకునేవారు. వారి శ్రద్ధ అబ్బుర పరిచేదిగా ఉండేది.
‌‌ /మరో వ్యాసంలో పూర్తి./
- నరసింహా మూర్తి.

1 comment:

  1. ఈరంకి సుబ్రహ్మణ్యం గారు: సాధన

    ReplyDelete