Breaking News

విజయనగరం లో జిల్లా శిబిరం ప్రయత్నాల లో

జిల్లా శిబిర ప్రయత్నాలలో ఉత్సాహం గా తిరుగుతున్నాను. కార్యకర్తలూ సంక్రాంతి సమయం లో కోస్తా జిల్లాల లో శిబిరం కొంచం కష్టమే అని అందరు అన్నా శ్రీ లక్ష్మణ్ రావుజీ భిడే గారు వస్తున్న సందర్భంగా తరుణ శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. కార్య కర్తలతో తిరుగుతూ ఒక రాత్రి పార్వతీపురం మాన్యులు కామ శాస్త్రి గారి ఆసుపత్రి ప్రక్కన ఉండే వారి ఖాళీ ఇంట్లో కూర్చుని ఒక గంట లో ఓ‌పాట వ్రాసాను. శాఖల్లో పాడుకున్నామని పాలమూర్ మాజీ జిల్లా ప్రచారక్ శ్రీ శ్రీహరి చెప్పారు. అది ఈ రోజు మీ కోసం మళ్లీ వ్రాస్తాను.
ఆలసింపకు అలసటొందకు
అమ్మ భారతి సేవ చేయగ
క్షణము విలువను బ్రతుకు పథమును
తెలిసి ముందుకు అడుగువేయగ
// ఆలసింప//

వేయి ఏళ్ళుగ బానిసత్వపు
బరువు మోసిన భారతాంబను
తనదు తనయుల దైన్యస్థితికి
అశ్రులుండిన ఆమె కనులను
ఆకలను అన్నార్తు గాంచి 
ముక్కలైనా ఆమె గుండెను
తలచి మనమూ బ్రతుకగలమా
తల్లి బాధను తీర్చలేమా// ఆల

కులంపేరుతో మతం పేరుతో
ప్రాంత భాషా ద్వేషాలతో
ఒకడు తనదగు స్వార్థమునకు
ఒరుల దోచే వంచనలతో
నీతి లేక‌ రీతి‌ లేక
దానవత్వపు దావానలంతో
తల్లికడుపున చిచ్చు పెట్టే
వంచకుల వంచనలు త్రుంచ//ఆ

ఒక్క తల్లికి తనయులైన
ఒకే రక్తము పంచి పుట్టిన
హిందుజాతిగ నిలచి వెలిగిన
అన్నదమ్ముల మందరమ్మను
నిజం తెలిపి నీడ చెరిపి
హెచ్చు తగ్గుల జాడ తుడిచి
అమ్మ మనసున శాంతి కూర్చే
అందరిని కలిపుంచు పనిలో//ఆ

నీకు నీపై నమ్మకముతో
నిస్వార్థ జీవన సాధనలతో
నియమ జీవన నిశ్చయముతో
నిత్యమై వెలుగొందు కళికగ
నిరుపమానము నీదు శక్తిని
తల్లిపదముల సమర్పించగ
తల్లి వైభవ గరిమ కొరకే
తనువుమనసునుధనమునీయగ
//ఆలసింపకు//

ఆ తరువాత నన్ను భారతీయ మజ్దూర్ సంఘ్ కి ఇచ్చారు. భాగ్యనగర్ వచ్చాను. అక్కడ మాననీయ బాల్ రెడ్డి గారి మార్గదర్శ నం లో పని చేసాను.
- నరసింహా మూర్తి.

1 comment:

  1. విజయనగరం లో జిల్లా శిబిరం ప్రయత్నాల లో

    ReplyDelete