Breaking News

శాఖ ల్లో తప్పులను సరిచేసే తత్వం


నేను బి యమ్ యస్ లో ప్రచారక్ గా పని చేసే రోజుల్లో బర్కత్పురా కార్యాలయం లోనే ఉండేవాడిని. ఉదయం శాఖకు వెళ్ళాను. మాననీయ సోమయాజులు గారు కూడ వచ్చారు. అప్పుడు వారు ప్రాంత ప్రచారకులు. ప్రార్థన లో చాలా తప్పులు చెప్పారు. సోమాయాజులు గారు ఆ అబ్బాయిని పిలిచి ఎన్నాళ్ళ నుండి ప్రార్థన చెబుతున్నావు అని అడిగారు. రెండు రోజుల‌నుండి అతని సమాధానం. సహజమే కొత్తవారికి అనుభవం కోసం అవకాశం ఇస్తుం టారు. ఆ రోజు వారు వెంటనే ఎటో వెళ్ళాలిసి ఉండింది. నన్ను పిలిచి వెంటనే ఒక అరగంట కూర్చుని ఇతని ప్రార్థన సరి చేయాలి అని చెప్పారు. అంత హడావుడి లో కూడా స్వయం సేవక్ ని సరి చేయడం వారు మరచి పోలేదు. నేను ఆ రోజే ఆ పని పూర్తి చేసాను.

ఇంతవరకు మామూలే రాత్రి కి భొజనాల దగ్గర కలిసాము. నన్ను పలుకరిస్తూ ఆ పిల్లాడు ప్రార్థన నేరచుకున్నాడా? అని అడిగారు. అప్పుడు నాకు అర్థం అయ్యింది ఏమిటంటే అంత చిన్న పనిని కూడా వారు గుర్తుంచుకుని అడగడం‌. వారు‌ తాను అనుకున్న పనిని అంత శ్రద్ధగా పూర్తి చేయించేవారు. అనేక పనుల లో తల మునకలయ్యే వారి మెదడు లో దానికి కూడా స్థానం ఉంది. వ్యక్తి నిర్మాణం ఇంత ముఖ్యమైనది.
- నరసింహా మూర్తి.

1 comment:

  1. శాఖ ల్లో తప్పులను సరిచేసే తత్వం

    ReplyDelete