Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 26 / 50


1967డిశంబర్ 27,28 న బాగలకోట లో శిబిరం. సింధ్ నుండి దేశవిభజన సమయంలోభారత్ కు వచ్చేసిన ఒక సింధీ వ్యక్తి ఇంట్లో శ్రీ గురూజీ కి వ్యవస్థ. దేశ విభజన అయినపుడు తమ సర్వస్వాన్ని పోగొట్టుకుని నిరాశ్రితులై భారత్ కు వచ్చిన ఆ వ్యక్తి , ఇక్కడ వైద్యవృత్తిలో నిమగ్నమయ్యారు. మంచి పేరు, డబ్బు సంపాదించారు. శ్రీ గురూజీ తో పరిచయమయ్యాక , కాసేపుసంభాషించి , మేడ మీద ఉన్న తమ క్లినిక్ కు పోయాడాయన. గదిలో శ్రీ గురూజీ, బాగలకోట సంఘచాలక్ అయిన శ్రీ వెంకటరావు కులకర్ణి మాత్రమే ఉన్నారు. అంతలో క్లినిక్ లోని సింధీ డాక్టర్ ' హుస్సేన్ ' అని పనివాడిని కేకేసి , అతడికి ఏదో పని చెప్పడం వీరిరువురూ విన్నారు. అపుడు శ్రీ గురూజీ ,శ్రీ కులకర్ణితో ' చూశారా, ఎవరివల్లనైతే వీరు తమ సర్వస్వాన్ని కోల్పోయారో , ఒట్టి చేతుల్తో ఇంత దూరం రావాల్సివచ్చిందో , అదే మనుషులు ఈయనకు ఇంటి నౌకరుగా కావాల్సివచ్చారు. తమకు జరిగిన అన్యాయం, అత్యాచారం మొదలగు వాటన్నింటిని ఇంత త్వరగా మరచిపోయారు. చివరకు వీరికి తమను బికారులను చేసిన ఒక హుశ్శేన్ తప్ప ఇతరులెవరూ దొరకలేదు. ఈ ఊరిలోని మల్లప్ప లేదా రంగప్ప దొరకలేదా? మన ఈ హిందూ సమాజం ఎంత త్వరగా విస్మరణశీల సమాజమవుతుంది అనడానికి ఈ ఇంటి యజమాని ఉదాహరణే చాలు ' అన్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete