Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 25 / 50



1967 డిశంబర్ 26,27 న గుల్బర్గా లో శిబిరం. జిల్లా సంఘచాలకులైన శ్రీ గణపతిభట్ సోమయాజి మొదటి సారిగా శిబిరంలో పాల్గొన్నారు. ఆయన శ్రీ గురూజీ ని అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఆ శిబిరంలోనే ఆయన శ్రీ గురూజీ ద్వారా సంఘ ప్రతిజ్ఞ స్వీకరించారు. తదనంతరం అక్కడి విభాగ్ ప్రచారక్ , ఆయనను పరిచయం చేస్తూ ' ఈయన శహబాద్ కు చెందినవారు' అని మొదలెట్టగానే, శ్రీ గురూజీ ' గణపతిభట్ సోమయాజి' అనేశారు. శ్రీ సోమయాజికి ఆశ్చర్యం.ఆయనను తాను చూడటం ఇదే మొదటిసారి. అయినా అప్పటికే ఆయనకు నా పేరెలా తెలిసిందా అని! దానికి కారణమిలా ఉంది: 
1966 లో రక్షాబంధన ఉత్సవం తర్వాత జిల్లా ప్రచారక్ గారు ఆయనతో , శ్రీ గురూజీకి ఉత్సవ నివేదికతోబాటు రాఖీ పంపమని చెప్పారు. దాని నివేదికతోబాటు రాఖీ పెట్టి పంపారాయన. రాఖీ అందిందనే విషయంతో శ్రీ గురూజీ నుండి ఉత్తరం వచ్చింది. శ్రీ సోమయాజికి అదే ఆశ్చర్యం కల్గించింది. ఇప్పుడు ' శహబాద్ కు చెందినవారు ' అనగానే మీరు నాకు ఆరోజు వ్రాసిన ఉత్తరంలో ' సోమయజి ' అని సంతకం చేశారు. అది ' సోమయాజి ' అని ఉండాలికదా? అని శ్రీ గురూజీ అన్నారు. అపరిచితుడైన వ్యక్తి, ఎప్పటి క్రితమో వ్రాసిన ఉత్తరం . అయినా అది ఏ ఊరినుండి వ్రాయబడిందో, వ్రాసిందెవరో కూడా గుర్తుంచుకోవడమే కాదు, అందులోని చిన్న తప్పును కూడా జ్ఞాపకం చేయడం చూసి శ్రీగణపతిభట్ సోమయాజి కి అవిస్మరణీయ అనుభవం అయిపోయింది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete