Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 24 / 50



1964 నవంబర్ 25,26 తేదీలలో మంగళూరు విభాగ్ కార్యకర్తల బైఠక్ లో జరిగిన సంఘటన. కార్యకర్తల పరిచయ కార్యక్రమం. ఒక కార్యకర్త తన పరిచయం చేయగానే, అతడిని బాధ్యత ఏమిటని అడిగారు శ్రీ గురూజీ. అతడు అమాయకంగానే సహ ముఖ్యశిక్షక్ అన్నాడు. వాస్తవంగా సంఘ కార్యవ్యవస్థలో అధికారికంగా అలాంటి బాధ్యత లేదు. అయితే కొన్నిసార్లు ఒక కొత్త కార్తకర్తకు మరింత అనుభవం రావడానికి మరియు శిక్షణ ఇవ్వడం కోసం అనధికారికంగా మరియు తాత్కాలిక వ్యవస్థగా అలాంటి బాధ్యతను సృష్టించడం జరుగుతుంటుంది. అలాంటివారికి ఈ రకమైన బైఠక్ లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం కూడా ఈ శిక్షణలో భాగంగానే. తనకు ఇవ్వబడిన బాధ్యత సంఘ కార్యవ్యవస్థలో అధికారికంగా లేదు అనికూడా అతడికి తెలియకుండా పోయే సాధ్యత కూడా ఉంటుంది.

ఆ కార్యకర్త ,సహ ముఖ్యశిక్షక్ అనగానే శ్రీ గురూజీ ' ఈ బాధ్యత ప్రకారం నువ్వు శాఖలో చేసే పనేమిటి? ' అనడిగారు. కొన్నిసార్లు ఏవో కారణాల వల్ల ముఖ్యశిక్షక్ శాఖలో లేనపుడు , నేను ఆ బాధ్యత నిర్వహిస్తాను అన్నాడా కార్యకర్త. అపుడు శ్రీ గురూజీ, ' నీకు అంతటి పని నిర్వహించడానికి మీ ముఖ్యశిక్షక్ ఎక్కువ అవకాశాలనిచ్చి సహాయం చేస్తుంటాడు గదా? అని మరో ప్రశ్న వేశారు. అతడు తికమక పడ్డాడు. ఆ ప్రశ్నలోని అంతరార్థం అతడికి అర్థం కాలేదు. బహుశా తన ముఖ్యశిక్షక్ మీదున్న గౌరవంతో ' అవును' అన్నాడు. బైఠక్ లో నవ్వులు. 

అపుడు ఆ కార్యకర్తకు చెందిన జిల్లా కార్యవాహ నిలబడి, అతడి సహాయానికి వచ్చాడు. ఆయన సీనియర్ కార్యకర్త. ఆయన చెప్పిన మాట మరీ తమాషాగా ఉంది. ఆయన లేచి ' గురూజీ, మీ ప్రశ్నలోని వ్యాకరణం చాలా కఠినమైంది (Grammar difficulty ) ' అని చెప్పడం మరిన్ని నవ్వులపువ్వులు పూయించింది. శ్రీ గురూజీ ఆయన మాటలను వినోదంగానే తీసుకున్నారు. తర్వాతి రోజుల్లోఎవరైనా కార్యకర్త, ఆయన ప్రశ్నతో తికమక పడితే, ' ఏమిటి వ్యాకరణం కఠినంగా ఉందా? ' అని శ్రీ గురూజీ యే అనేవారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. శ్రీ గురూజీ ఆయన మాటలను వినోదంగానే తీసుకున్నారు. తర్వాతి రోజుల్లోఎవరైనా కార్యకర్త, ఆయన ప్రశ్నతో తికమక పడితే, ' ఏమిటి వ్యాకరణం కఠినంగా ఉందా? ' అని శ్రీ గురూజీ యే అనేవారు.

    ReplyDelete