Breaking News

భారతీయత - హిందుత్వం - జాతీయత - గందరగోళం - 2

ఈ దేశ జాతీయత హిందుత్వం ని ఇంగ్లీషు వాడు ఇందులోనండి ముస్లిముల ను విడగొట్టడానికి దీన్ని ఒక మతం గా సృష్టించి, ముస్లిములని వారి పూర్వికులుగా అరబ్బులను, టర్కీవారిని సిరియన్ లను, ఇరాన్, ఇరాక్ వారిని సృష్టించి ఈ దేశజాతీ యత నుండి విడగొట్టి, ఈ దేశ జాతీయత భారతీయత అందులో హిందువులు, ముస్లిమ్లు రెండు మతాలు అన్నాడు. మన వాళ్లు రాజ్యాంగం లో హిందు ను నిర్వచిస్తూ ఏమి రాయాలొ తెలియక ముస్లిములు
క్రిస్టియన్ లు కాకుండా అని, అందులో బౌద్దులు, జైనులు, సిక్కుల ను కలుపుకొని అని వ్రాసారు.

మిగిలిన హిందువుల లో సామాజిక అసమానతల విషయమై పెద్ద చర్చ జరిగి అందులొ కులాల వారిగా విభజన, ఆరక్షణలు ఇత్యాదులు జరిగి
మళ్లి ఆ గ్రుపుల రాజకీయీకరణ జరిగి విభజనను స్థిరీకరిస్తున్నారు. స్వతంత్రం వచ్చాక ఈ జాతీయతను పెంచడం అంటె నీవు వేరు, నేను వేరు కాని అందరం భారతీయులం అనే ప్రచారం జరిగి విభజన పెంచారు.

ఇందులో ఎవరైనా కలపడం కొరకు ఆలొచిస్తే వాడి కులం ఏమిటి? వాడి నెందుకు మనం అనుసరించాలి, ఆ కులం వారి డామినెషన్ పెరుగు తందేమొ? కమిటి లో మన కులం వాడున్నాడా? ఇలా మనం ఒక జాతీయులం అనేది పోయి, ఒకరికి మరొకరు శత్రువులు గా భావించే పరిస్థితి దాపురించినది. పాత అసమానత కాకుండా కొత్త అభద్రతా భావం పెరిగింది.
భారత ప్రజల విభజనలో మొదట్లో కలవారు, లేని వారు అని పాడిన కమ్యునిష్టులు తరువాత కులాలు, ఆర్య, ద్రావిడ సిద్ధాంతాలు అన్నీ విఫలం అయ్యాక, పశ్చిమ దేశాలు ప్రతిపాదించిన దళితులను విడగొట్ట ‌డానికి పురాణాల లొ విలన్ల ను దళితులు అని వారిని అగ్రవర్ణాల వారు నాశనం చేసారని పరస్పరం విరుద్దత సృష్ఠించే పని చేస్తున్నారు.
అంగ్లేయులు సృష్టంచిన ఈ దేశ జాతీయతను మతం గా మార్చి ముస్లిం లను రెచ్చగొట్టి విడగొట్టిన పద్ద తిలోనే అగ్రవర్ణాలు అని పేరి పెట్టిన వారిపై, ఆ వ్యవస్థలపై రెచ్చగొట్టే పుస్తకాలు వ్రాసి,గోమాంసం,పురాణాల విలన్లను దళితులుగా సృష్టి చేసి ఇక్కడి జాతీతయను కాకుండా దాని విభజనకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి మన దేశాన్ని రక్షించుకోవడం ఎలా? మరో వ్యాసం లో.
- నమస్సులతో మీ నరసింహా మూర్తి.

1 comment:

  1. మరి మన దేశాన్ని రక్షించుకోవడం ఎలా? మరో వ్యాసం లో.

    - నమస్సులతో మీ నరసింహా మూర్తి.

    ReplyDelete