Breaking News

1984 తృతీయ వర్ష శిక్షావర్గ నాగపూర్

వర్గ లో ఉత్సాహంగా మొదలయ్యి నా శారీరక్ లో విషయాల్లో మా వాహిని ప్రముఖ్ గా మకరంద కర్కారే ఉండేవారు. సాయంత్రం గణ సమత ఉత్సాహంగా జరిగేది. ఉదయం జరిగే నియుద్ధ లో ఆఘాత్ ఇస్తున్నప్పుడు హుప్ అనే హుంకారాన్ని వెనుక లైన్ లో విశ్వనాథ పప్ అనగానే సందరూ నవ్వే వారు. శిక్షక్ కి అది వినపడేది కాదు. అందరిని వారు ఉగ్రంగా చూస్తూ హుప్ హుప్ అంటుండేవారు.
మరుసటి రోజు ఉదయం నుండి మాకు చర్చాగట అంటే రోజు ఒక గంట సేపు మాచర్చాగట ప్రముఖ్23 మందికి ఒక విషయం పై కూలంకుష చర్చ మా ప్రముఖ్ నిర్వహించే వారు. అప్పట్లో నాగపూరికి ప్రాంత స్థాయిఉండింది. ఆ ప్రాంత ప్రచారకులుగా అప్పట్లో పూజనీయ మోహన్జీ భాగవత్ ఉండేవారు. వారే తదనంతర కాలం లో మనకి సర్ కార్యవాహ్, సరసంఘ చాలకులు అయ్యారు. వారితో 25 రోజులు రోజూ ఒక గంట చర్చ కు కూర్చోవడం నిజంగా మా అదృష్టమే.
మాకు సంస్కృత సంభాషణా అంశం శ్రీ కృష్ణ శాస్త్రి గారు రోజుకి ఒక గంట నిర్వహించే వారు. ఒక్క ఆంగ్ల పదం ఒక్క హిందీ పదం లేకుండా మొత్తం సంస్కృత పదాలతో సాగేది. మేము చిన్న చిన్న వాక్యాలు ప్రారంభం చేసాము. మాననీయ సుబ్రహ్మణ్యం గారు వచ్చేవారు. వారు తరువాత గుంటూరు జిల్లాలో పర్యటనలో కుటుంబాలతో ఆ భాష లొనే మాట్లాడటం చేశారు. గుంటూరు లో నేను వారి వెంట ఉన్నప్పుడు భాషానువాదం చేస్తే గుంటూరు నగరం లో ఇబ్బంది పడేవారు కాదు. కానీ మిగిలిన గ్రామాల్లో పాపం వాళ్ళూ నేర్చుకునేవారు. ప్రసాద రాజు అక్కడే మొదలెట్టాడు. మోహన్జీ చర్చ మొదలెత్తగానే తను చేయెత్తి సంస్కృతం లో మొదలెట్టి విరిచి విరిచి ఏదో మాట్లాడేవాడు. మూర్తి అనువాదం చేస్తాడని ప్రకటించేవాడు. మొహన్జీ నవ్వుతూ అనువాదం అవసరం లేదు. మాకందరికి బాగా అర్థమయ్యింది. మిగతా వారు మాట్లాడండి అనే వారు. అందరూ ఒక్కసారి నవ్వే వారు. ఎంత ఉత్సాహవంతంగా ఎన్ని లోతైన విషయాలను క్లుప్తంగా, స్పష్టంగా తేల్చి చెప్పేవారో..
ఇంకో వ్యాసంలో మరిన్ని విషయాలు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. వర్గ లో ఉత్సాహంగా మొదలయ్యి నా శారీరక్ లో విషయాల్లో మా వాహిని ప్రముఖ్ గా మకరంద కర్కారే ఉండేవారు. సాయంత్రం గణ సమత ఉత్సాహంగా జరిగేది.

    ReplyDelete