Breaking News

భారతీయత - హిందుత్వం: జాతీయత గందరగోళం - 1

అనాదిగాఇది హిందూ దేశం. దీన్నె భారతదేశం అనీ అన్నారు. రెండింటికి తేడా ఏమీ లేదు. ఏ మతం వారైనా ఇక్కడి వారి జాతీయత ఒక్కటే. ఇక్కడ శైవులు, వైష్ణవులు, శాక్తేయులు
గాణపత్యులు, వైదికులు, శాస్త పూజకులు, బౌద్ధులు, జైనులు, అయ్యప్ప భక్తులు, ఇంకా రకరకాల దేవతారాధన చేసె వారు, అసలు దేవుడే లేడనే వారు, ప్రకృతి ఆరాధకులు ఎన్ని రకాల వారున్నా జాతీయతను అనుసరించి అందరూ హిందువులే. మనం దేవుళ్లకు చుట్టరికాలు కూడ కలిపేసుకున్నాము.
ఏకం సత్, విప్రాహ బహుధా వదంతి. దేవుడొక్కడే, యొగులు రకరకాలుగా చెబుతారు అనే విషయం నమ్మె వాళ్లము కాబట్టి, ఎవరి పద్ధతి వారిది అని మెలిగే వారము.

ఈదేశం పైకి క్రీస్తు పూర్వం నుండే గ్రీకుల నుండి దండయాత్రలు జరిగాయి. పళ్లుండే చెట్లకే కదా రాళ్లు పడతాయి. ప్రపంచంలో అత్యధిక డబ్బుండే దేశం. వారి తరువాత హూణులు,శకులు, కుషాణులు, టర్కి, సిరియా, ఆఫ్గనిస్థాన్ మీదుగా పశ్చిమాసియా మూకలు అనేకం దండయాత్రలు చేెసారు. రకరకాల వంశాల వారు, ఊసర క్షేత్రం నుండి సింధు, గంగా మైదానాలను చూసి ఇక్కడే రాజ్యం చేస్తూ ఉండి పోయారు. వాళ్ల మతాల లోకి నయాన, భయాన ఇక్కడి జాతీయులనె మతం మార్చారు. మన భారతీయ పద్ధతిని అనుసరంచి ఇది మరో పద్ధతిలో దేవుడిని ఆరాధించటం గా ఇక్కడి హిందువులు మారారు.
ఇంగ్లీషువాడు విభజించి పాలించే పద్ధతిలో ఈ మతం‌మారిన వారిని‌ విదేశాలనుండి వచ్చిన వారితో కలిపి మీరు వేరు ఈ మిగతావారు వేరు, రెండు వేరు జాతులు గా నమ్మబలి కాడు. ఆ విధం గా హిందూ జాతీయ తను విడగొట్టి వారిని ముస్లిం జాతి అన్నాడు. వారికి వేరే దేశం నినాదం తొ జిన్నా ముస్లిం లీగ్ అని పార్టి పెట్టి, పాకిస్తాన్ ను ఈ హిందూ జాతీయత 
ను విడగొట్టి సాధించారు. మిగిలిన భారత దేశం లో ఉన్న ముస్లిమ్సు కూడ ఇక్కడి జాతీయత లో కలిసిపోకుండా విడిగావుంచే ప్రయత్నం నెహ్రు గారి కాంగ్రెస్‌, కమ్యునిష్టుల ప్రయత్నం గా వేరే ఓటు‌బాంకు గా, మన జాతీయత భారతీయత అని, అందులో ముస్లిం, హిందూ అని, రెండు మతాలు భాయి, భాయి అని, ఒకే జాతీయతను చీల్చి, మిగిలిన హిందువులను కూడ విడగొట్టే ప్రయత్నాలను కొనసాగించారు.
‌‌ 
ఇంకా ఉంది.
- నమస్సులతో మీ నరసింహా మూర్తి.

1 comment:

  1. భారతీయత - హిందుత్వం: జాతీయత గందరగోళం - 1
    - నమస్సులతో మీ నరసింహా మూర్తి.

    ReplyDelete