Breaking News

సదర్ ఉత్సవం-Sadar Uthsav| Another Traditional Fest in Telangana

భాగ్యనగరంలో బతుకమ్మ, బోనాల పండుగల తర్వాత అంతటి ప్రత్యేకతను సంతరించుకున్న మరో పండుగ సదర్. యాదవులంతా కలిసి శతాబ్ద కాలంగా ఘనంగా జరుపుకుంటున్న ఈ ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. దీపావళి పండుగను పురస్కరించుకొని గల్లీగల్లీలో భారీ దున్నపోతుల ప్రదర్శనలతో నిర్వహించే పండుగను ఈ ఏడాది అధికారికంగా నిర్వహిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తూ... రెట్టింపు ఉత్సాహంతో సదర్ పండుగకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని తమ ఆనందంలో భాగస్వాములను చేస్తోన్న యాదవులు.... ఈ సారి పండుగలో కోట్ల రూపాయల విలువైన నాలుగు భారీ దున్నపోతులను ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించబోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకే పరిమితమైన ఈ పండుగను తాత ముత్తాతల దగ్గరి నుంచి నేటి తరం వరకు సంప్రదాయంగా పాటిస్తూ... పాడిని పూజిస్తూ వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సదర్ ఉత్సవాలపై ఇదీ సంగతి ప్రత్యేక కథనం.

1 comment:

  1. పాడిని పూజిస్తూ వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు.

    ReplyDelete